»   » పవన్ కళ్యాణ్ కళ్లు చెమర్చాయి (ఫోటో)

పవన్ కళ్యాణ్ కళ్లు చెమర్చాయి (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత రామానాయుడు మరణ వార్త విన్న వెంటనే తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన ఆ మహానుభావుడి మరణవార్తను పవన్ జీర్ణించుకోలేకపోయారు. మృత దేహాన్ని చూసిన వెంటనే ఆయన కళ్లు చెమర్చాయి. పవన్ కళ్యాణ్ వెంట దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత శరత్ మరార్ తదితరులు ఉన్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శతాధిక చిత్రాల నిర్మాత... మూవీ మొఘల్‌గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడు (79) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాసవిడిచారు.

Pawan Kalyan Pay Last Respects to Ramanaidu

రామానాయుడు అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి రామానాయుడు స్టూడియోకు చేరుకుంది. రామానాయుడు భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వరకు రామానాయుడు స్టూడియోలో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రామానాయుడు భౌతికకాయాన్ని ఉంచే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామానాయుడు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం తర్వాత రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో రామానాయుడు పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Pawan Kalyan, Allu Arjun and other mega family members paid their last respects to renowned filmmaker Daggubati Ramanaidu, who passed away on Wednesday.
Please Wait while comments are loading...