»   » అక్కినేనికి నివాళి, త్రివిక్రమ్‌తో పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

అక్కినేనికి నివాళి, త్రివిక్రమ్‌తో పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక దేహానికి నివాళులర్పించేందుకు నటుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఏఎన్ఆర్ తనయుడు నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏఎన్ఆర్ గురించి మాట్లాడుతూ....శివ విజయం తర్వాత అక్కినేని నా భుజం తట్టి ప్రోత్సహించడాన్ని మరువలేను అని వ్యాఖ్యానించారు. అక్కినేని నాగేశ్వరరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. తొలితరం నటవర్గం నుంచి మూడవ తరం నటీనటుల వరకు వారధిగా, ఆదర్శంగా, స్ఫూస్పూర్తిమంతంగా అక్కినేని నిలిచారని కొనియాడారు.

అక్కినేని పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ తన దర్శకత్వంలో నటుడిగా అక్కినేని 26 సినిమాల్లో నటించారన్నారు. అక్కినేని మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. అక్కినేని మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


అక్కినేని మృతి విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ అన్నాపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా అక్కినేనికి నివాళులు అర్పించేందుకు ఇక్కడికి చేరుకున్నారు.

నాగార్జునకు పరామర్శ

నాగార్జునకు పరామర్శ


అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జునను పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్.

అక్కినేని పార్థివ దేహం వద్ద

అక్కినేని పార్థివ దేహం వద్ద


అన్నపూర్ణ స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం ఉంచిన అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయం వద్ద పవన్ కళ్యాణ్.

నివాళులు అర్పిస్తూ...

నివాళులు అర్పిస్తూ...


అక్కినేని పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న పవన్ కళ్యాన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Pawan Kalyan and Trivikram paying condolences to Akkineni Nageswara Rao. Legendary actor Akkineni Nageshwar Rao (90) passed away on Tuesday night. He was battling with cancer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu