»   » పవన్ కళ్యాణ్‌కు...సీనియర్ ఎన్టీఆర్ అంత సీన్ ఉందా?

పవన్ కళ్యాణ్‌కు...సీనియర్ ఎన్టీఆర్ అంత సీన్ ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలిన ఇండస్ట్రీ రారాజుల్లో ఒకరు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన నందమూరి తారక రామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయారు.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని అందుకోవడంలో పోటీ పడుతున్న టాప్ హీరోల్లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం తెలుగు నాట అత్యంత ఎక్కువ ప్రేక్షకాదరణ కలిగిన హీరో పవన్ కళ్యాణ్. సినిమా కలెక్షన్ల విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు.

awan Kalyan to play Lord Krishna

త్వరలో పవన్ కళ్యాణ్ 'ఓ మై గాడ్' అనే హిందీ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడి పాత్రను పోషించబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ వరకు తీసుకుంటే.....ఇప్పటి వరకు కృష్ణుడిగా, రాముడిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే.

ఆయన తర్వాత చాలా మంది కృష్ణుడు, రాముడు పాత్రలు వేసినా....ఆయన్ను మాత్రం మరిపించలేక పోయారు. మరి ఇపుడు పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడి పాత్రను వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సీరియర్ ఎన్టీఆర్‌ మాదిరి పవన్ కళ్యాన్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేస్తారా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.

హిందీ వెర్షన్ 'ఓ మై గాడ్' చిత్రంలో అక్షయ్ కుమార్ లార్డ్ శ్రీకృష్ణ పాత్రలో నటించగా.....తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషించనున్నారు. హిందీలో పరేష్ రావల్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. బాలీవుడ్లో ఈచిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెలుగులోనూ ఈచిత్రం సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.

English summary
Biggest multi starer of the decade Pawan Kalyan & Daggubati Venkatesh Movie Confirmed. Remake of Oh My God. Suresh Babu & Sharat Marar to produce it. Venky to enact Paresh Rawal role and Pawan Kalyan will do role of Lord Krishna. Pawan kalyan shoot part would be for 20-30 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu