twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్యనే విబేధించా.. నాకు అదో లెక్కనా?.. పవన్ కల్యాణ్

    ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై చర్చించానికి ఏపీ సచివాలయానికి వెళ్లిన పవన్ మీడియాతో మాట్లాడారు.

    By Rajababu
    |

    ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై చర్చించానికి ఏపీ సచివాలయానికి వెళ్లిన పవన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయాల గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగు దేశం పార్టీతో రహస్య స్నేహం ఉందని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నను పవన్ కల్యాణ్ ఖండించారు.

    రాజకీయాలకు అతీతంగా చూడాలి

    రాజకీయాలకు అతీతంగా చూడాలి

    ఉద్ధానం సమస్యపై చాలామంది స్పందించారు. ఈ సమస్య బారిన బాధితులకు నా వంతు సహకారం అందిస్తాను. రాజకీయాలకు అతీతంగా ఉద్ధానం సమస్యను చూడాలి. పేద ప్రజలు చనిపోతున్నప్పుడు ఈ అంశాన్ని రాజకీయ లబ్దికి ఉపయోగించుకోవద్దు అని పవన్ అన్నారు.

    Recommended Video

    Pawan Kalyan meets Chandrababu Naidu, Fans Bike rally
    టీడీపీతో రహస్య ఒప్పందం లేదు

    టీడీపీతో రహస్య ఒప్పందం లేదు

    తెలుగుదేశం పార్టీతో నాకు ఎలాంటి రహస్య ఒప్పందం, స్నేహం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించాడానికి ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీతో కామన్ మినిమమ్ ప్రొగ్రాంను రూపొందించాం. దాని ప్రకారమే ప్రస్తుతం సమావేశమయ్యాం. ఏపీ రాజకీయాల్లో ఎవరి బలం వారికి ఉంది అని పవన్ కల్యాణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాను..

    టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాను..

    రాజకీయపరమైన విభేదాల కారణంగా అన్నయ్యకే దూరమయ్యాను. దాని ముందు టీడీపీ ఒక లెక్క కాదు. సమస్యల పరిష్కారం గురించి టీడీపీకి వ్యతిరేకంగా ఇటీవల మాట్లాడాను. అలాంటి పరిస్థితుల్లో నాకు వారికి స్నేహం ఉందా అని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు.

    ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలి

    ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలి

    ఉద్ధానంలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అనాథ పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి. వ్యాధి తీవ్రత గుర్తించే సరికి పరిస్థితి చేయి దాటిపోతున్నది. కిడ్నీ సమస్య పరిష్కారానికి జనసేన తరఫున తన వంతు కృషి చేస్తాను. జనసేన కార్యకర్తల సేవలను ఉపయోగించుకొంటాం అని అని పవన్ కల్యాణ్ తెలిపారు.

    English summary
    Jana sena chief, Film actor Pawan Kalyan responded over AP political, Social issues. He said I differed with his brother Chiranjeevi on political grounds. My main agenda is only peoples welfare
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X