For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్‌ మొదటి సారి ఇలా... ప్రశంసల జల్లు కురిపించేసాడు,అంతా ఆశ్చర్యం

  By Srikanya
  |

  హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరో అయినప్పటికీ వీలైనంత వరకు సినిమా వాతావరణానికి దూరంగానే ఉంటారు. ఆయన ఎక్కడా సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించారు. అలాంటి ఆయన మొట్ట మొదటిసారి ఒక సినిమా గురించి మాట్లాడారు.

  మాట్లాడటమంటే అలా ఇలా కాదు ఆ సినిమాని, అందులో హీరోని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సినిమా గురించి మాట్లాడుతూ..ప్రేక్షకులను పవన్‌కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. ఆశ్చర్యం కాకుంటే మరేంటి? ఎప్పుడూ సోషల్‌ మీడియాలో రాజకీయ సామాజిక అంశాలపై స్పందించే పవన్‌కల్యాణ్‌ తొలిసారి ఓ సినిమా గురించి మాట్లాడారు.

  అదీ కొత్త ఏడాది కానుకగా ఫస్ట్‌ లుక్, మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసిన ఆయన కొత్త సినిమా 'కాటమరాయుడు' గురించి కాదు. ఓ హిందీ సినిమా చూసి ట్విట్టర్‌లో స్పందించారాయన.

  రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న...

  రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న...

  పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ సినిమానే అమీర్ ఖాన్ నటించితిన్ ‘దంగల్'. ఈ మధ్యే రిలీజైనా ఈ బాలీవుడ్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. భారత మల్ల యుద్ధ యోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

  శుభాకాంక్షలు తెలియచేస్తూ...

  శుభాకాంక్షలు తెలియచేస్తూ...

  ఆమిర్‌ఖాన్‌ హీరోగా నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దంగల్‌'. ఈ చిత్ర యీనిట్ పై సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన జీవిత కథతో మంచి విజయం అందుకున్న ఆమిర్‌ ఖాన్‌కు, ఆయన బృందానికి పవన్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

  హృదయాలని దోచుకున్నాడు

  ‘దంగల్‌'ని చూశానని, చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకోకపోతే మనస్సాక్షి ఒప్పుకోదనిపించిందని అన్నారు. ఆమిర్‌ఖాన్‌ చక్కని నటనతో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది హృదయాల్ని దోచుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి నటుడు మన దేశంలో ఉండటం దేశానికే గర్వకారణమని చెప్పారు.

  అభినందనలు

  మనసుల్ని కదిలించేలా చిత్రాన్ని తీశారంటూ దర్శకుడు నితీశ్‌ తివారీని, మిగిలిన చిత్ర బృందాన్ని అభినందించారు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రాని ప్రత్యేకించి అభినందించారు.

  ఆ దిశగా ....

  ‘దంగల్‌' సినిమా మనమంతా మహిళా సాధికారిత దిశగా పనిచేయాలని విషయాన్ని గుర్తుచేసిందని పవన్‌ పేర్కొన్నారు.

  పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటంతో...

  పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటంతో...

  'దంగల్‌' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమిర్‌ఖాన్‌ హైదరాబాద్‌ వచ్చి నప్పుడు ''తెలుగులో మల్టీస్టారర్‌ చేయవలసి వస్తే.. చిరంజీవి లేదా పవన్‌కల్యాణ్‌లతో చేస్తా'' అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమా గురించి మాట్లాడటంతో ఇప్పుడు అందరి దృష్టీ మరోసారి దంగల్ పై పడింది.

  ఇప్పటికే అంత వసూలు

  బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్‌' చిత్రం దేశ, విదేశీ మార్కెట్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. డిసెంబరు 23న భారత్‌లో విడుదలైన ఈ చిత్రం డిసెంబర్‌ 31 నాటికి మొత్తం రూ.239.01 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

  నాట్ అవుట్

  నాట్ అవుట్

  ‘దంగల్‌' రికార్డు సృష్టిస్తూ.. రూ.250 కోట్ల దిశగా వెళ్తొందని పేర్కొన్నారు. ఆదివారంతో చిత్రం వసూళ్లు దేశవ్యాప్తంగా రూ.250 కోట్లు దాటుతుందని భావించారు. అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన వసూళ్లును రాబడుతోందని తెలిపారు. విదేశాల్లో ఈ చిత్రం శనివారానికి 19.28 మిలియన్లు (రూ. 131.02 కోట్లు) వసూలు చేసిందని, ఇంకా కొన్ని స్క్రీన్లు రిపోర్ట్‌ చేయాల్సి ఉందన్నారు.

  ప్రశంసలు..కలెక్షన్స్..

  ప్రముఖ రెజ్లర్‌ మహవీర్‌సింగ్‌ ఫొగట్‌ జీవితం ఆధారంగా నితీశ్‌ తివారీ ‘దంగల్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. సాక్షి తన్వార్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖుర్రానా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి.

  English summary
  'Dangal' and Aamir Khan have come in for huge praise from Powerstar. Describing 'Dangal' as a peerless, matchless and outstanding biopic, Pawan says that he felt his conscience would choke him if he didn't talk about the experience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X