»   »  'పులి' కోసం పవన్ ఫారెస్ట్ కు...

'పులి' కోసం పవన్ ఫారెస్ట్ కు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
'పులి'కోసం పవన్‌కళ్యాణ్ తలకోన అడవులకు వెళ్తున్నారు. మేటర్ యేంటంటే... ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ ద్విపాత్రల్లో నటిస్తోన్న చిత్రం "పులి". ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్‌గాఒక పాత్ర . ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ దిల్‌సుఖ్‌నగర్‌లోని విక్టోరియా స్కూల్లో నాలుగు రోజుల పాటు జరిగింది.

కొన్ని యాక్షన్ సన్నివేశాలను 1000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య చిత్రించారు. నేటి(శుక్రవారం) నుంచి యాక్షన్‌తో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం పవన్ తలకోనకు ప్రయాణమవుతున్నారు. ఎనిమిది రోజుల షూటింగ్ అనంతరం తిరిగి హైదరాబాద్ రానున్నారని చిత్ర యూనిట్ అంటున్నారు.

యాక్షన్ సన్నివేశాలను విజయ్ నేతృత్వంలో చిత్రిస్తున్నారు. కనకరత్నం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X