»   » అజిత్ గురించి... పవన్ కళ్యాణ్ చెప్పింది ఇలా, ప్రచారం మరోలా!

అజిత్ గురించి... పవన్ కళ్యాణ్ చెప్పింది ఇలా, ప్రచారం మరోలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ అజిత్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వీరి కాంబినేషన్లో అసలు ఎలాంటి ప్రాజెక్టు ప్రపోజల్స్ లేవు, అలాంటి ఆలోచన కూడా ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు.

అయితే ఈ ప్రచారం జరుగడానికి కారణం ఇటీవల పవన్ కళ్యాణ్ లండన్ లో చేసిన కామెంట్సే అని స్పష్టమవుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ లండన్లో జరిగిన యూకె తెలుగు అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడి ఎన్నారైలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఈ సందర్బంగా ఓ అభిమాని నుండి ఆయనకు ఓ ప్రశ్న ఎదురవ్వగా...కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రతిపాదనతో ఎవరూ సంప్రదించలేదని.. ఫ్యూచర్‌లో అలాంటి కథతో ఎవరైనా వస్తే తప్పకుండా అజిత్‌తో కలిసి నటిస్తాను అని చెప్పారు.

Pawan Kalyan ready to acting with Ajith Kumar

ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు దాదాపుగా అందరు స్టార్స్ ఇలాంటి సమాధానమే చెబుతారు. ఒక వేళ పవన్ కళ్యాణ్... 'నేను చేయను, ఆయనతో చేయడం ఇష్టం లేదు' లాంటి సమాధానాలు చెబితే... ఎందుకు చేయరు? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే ప్రశ్నలు వస్తాయి, మీడియాలో అదో పెద్ద వివాదం అవుతుంది.

అయితే పవన్ కల్యాణ్ ఆ ప్రశ్నకు క్యాజువల్ గా స్పందించడంతో...ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఒకటైతే, బయట ప్రచారం జరుగుతున్న విషయం మరొకటి... అదన్నమాట సంగతి.

English summary
Telugu power star Pawan Kalyan wishes to act with Thala Ajith Kumar in a film. He has said that so far no one has approached him with such an offer, but he will be interested if something comes up.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu