»   » దాసరిపై పవన్ కామెంట్స్: రంగస్థలం నుంచి, ఆయన సినిమాలు అలా ఉండేవి.. పవన్‌తో సినిమా!

దాసరిపై పవన్ కామెంట్స్: రంగస్థలం నుంచి, ఆయన సినిమాలు అలా ఉండేవి.. పవన్‌తో సినిమా!

Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan Praises Dasari Narayana Rao

దర్శక రత్న దాసరి నారాయణ రావు జయంతి నేడు. ఆయన జయంతిని తెలుగు చిత్ర పరిశ్రమ డైరెక్టర్స్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాదే దాసరి నారాయణ రావు తుది శ్వాసవిడిచారు. దర్శకుడిగా, నటుడిగా ఆయన సాధించిన విజయాలు అసామాన్యమైనవి. దాసరి జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. దాసరి సాధించిన విజయాల్ని, ఇండస్ట్రీలో తలెత్తిన సమస్యలు పరిష్కారానికి ఆయన చూపిన చొరవని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఇటువంటి పరిస్థితుల్లో దాసరి ఉండిఉంటే బావుండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పలు విషయాల్లో దాసరిని పవన్ కీర్తించారు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా దాసరి ముందుండి పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

దర్శకుడికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారు

దర్శకుడికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారు

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకుడి స్థాయిని పెంచారు. దర్శకుడు అనే పేరుకు ఆయన బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి దాసరి గారి జన్మదిన వేడుకని డైరెక్టర్స్ డే గా జరుపుకోవడం చాలా సంతోషకరం అని పవన్ అన్నారు.

ఆయన సినిమాల్లో కుటుంబ విలువలు

ఆయన సినిమాల్లో కుటుంబ విలువలు

దాసరి తొలి చిత్రం తాతామనవడు నుంచి ఆయన చిత్రాల్లో కుటుంబ విలువలు, సామజిక సృహ కనిపించేదని అన్నారు. దాసరి కేవలం దర్శకుడిగా మాత్రం కాక నటుడిగా కూడా అనేక విజయాలు సాధించారు.

రంగస్థలం నుంచి

రంగస్థలం నుంచి

రంగస్థలం నుంచి ఆయన సినిమాల్లోకి ప్రవేశించారు. దర్శకుడిగా తిరుగులేని ప్రతిభ కనబరుస్తూ ఎదిగారు. దాసరి రాజకీయ నాయకుడిగా కుడా సేవలు అందించిన సంగతి తెలిసిందే.

సినిమా కుటుంబం అనే భావన

సినిమా కుటుంబం అనే భావన

చిత్ర పరిశ్రమలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేవారు. సినీ ఇండస్ట్రీ కుటుంబం అని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలనే భావన దాసరితో ఉండేదని పవన్ అన్నారు.

 దాసరిలాంటి వారు అవసరం

దాసరిలాంటి వారు అవసరం

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు దాసరి లాంటి వారు అవసరం అని పవన్ అభిప్రాయపడ్డారు. అందరు దాసరి అడుగుజాడల్లో నడచి తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని పెంచాలని పవన్ అన్నారు.

పవన్ కళ్యాన్‌తో సినిమా

పవన్ కళ్యాన్‌తో సినిమా

దాసరి, పవన్ కళ్యాణ్ కలయికలో ఓ చిత్రం రావాల్సింది. పవన్ కళ్యాణ్ హీరోగా తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కూడా దాసరి అప్పట్లో ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ లో తదుపరి అడుగు పడక ముందే దాసరి మరణించిన సంగతి తెలిసిందే.

English summary
Pawan Kalyan remembers Dasari Narayana Rao on his birth anniversary
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X