twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి నిరసనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. న్యాయం జరగాలంటే చేయాల్సింది ఇలా కాదు!

    |

    Recommended Video

    Pawan Kalyan Response On Sri Reddy Protest

    గత నెల రోజులుగా శ్రీరెడ్డి వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో జరుగుతున్న చీకటి కోణాల గురించి శ్రీరెడ్డి సంచలన వాస్తవాలు వెల్లడిస్తోంది. ప్రముఖులపై కూడా ఆరోపణలు చేస్తూ ఫొటోలు లీక్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రముఖులు మాట్లాడాలని శ్రీరెడ్డి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ముందు శ్రీరెడ్డి ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఢిల్లీలో చిన్నారి అత్యాచారానికి గురైన ఘటనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నేడు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు శ్రీరెడ్డి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

     నెలరోజులుగా

    నెలరోజులుగా

    గత నెల రోజులుగా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చివరకు ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న నిరసన కూడా చేసింది. శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

    పవన్ కళ్యాణ్‌కు ఎదురైన ప్రశ్నలు

    పవన్ కళ్యాణ్‌కు ఎదురైన ప్రశ్నలు

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మీడియా నుంచి శ్రీరెడ్డి నిరసన సంబందించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఢిల్లో అత్యాచారానికి గురైన చిన్నారి ఘటనకు వ్యతిరేకంగా పవన్ నేడు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

     పోలీస్ కేసు పెట్టాలి

    పోలీస్ కేసు పెట్టాలి

    శ్రీరెడ్డి నిరసనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నిరసన తెలియజేసే విధానం ఇది కాదని అన్నారు. అన్యాయం జరిగిఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయాలని అన్నారు. చట్టాల ద్వారానే న్యాయం జరగాలని, అది మీడియా ఛానళ్ల ద్వారా కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.

    సెన్సేషన్ అవుతుంది కానీ

    సెన్సేషన్ అవుతుంది కానీ

    మీడియా షోలకు హాజరైతే సమస్య సెన్సేషన్ అవుతుంది కానీ పరిష్కారం కాదని అన్నారు. పోలీస్ కేసు పెట్టాక ఆ ఆ తరువాత మీడియా సంస్థలు, ప్రజా సంఘాలు అండగా నిలవాలని అన్నారు.

     కర్ర పట్టుకుని తరమాల్సి వచ్చింది

    కర్ర పట్టుకుని తరమాల్సి వచ్చింది

    తమ్ముడు షూటింగ్ సమయంలో మహిళలపై యువత వస్తుండడంతో తాను కూడా కర్ర పట్టుకుని తరమాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మీడియా చానళ్ళు సెన్సేషన్, టిఆర్పి కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

    English summary
    Pawan Kalyan response on SriReddy Protest. SriReddy should file the case says Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X