పవన్ కళ్యాణ్ పరమ ప్లాపు సినిమా అక్కడ రికార్డులే రికార్డులు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లాపు సినిమాలు కూడా భారీ వసూళ్లు కురిపిస్తాయి, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తాయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. తాజగా ఇది మరోసారి రుజువైంది. ఆయన కెరీర్లో అతిపెద్ద ప్లాప్ సినిమా లిస్టులో ఒకటిగా ఉన్న 'అజ్ఞాతవాసి' సరికొత్త రికార్డును నమోదు చేసి హాట్ టాపిక్ అయింది.
అజ్ఞాతవాసి విడుదలైన చాలా రోజులైంది కదా ఇప్పుడు కొత్తగా రికార్డులేంటి? అనుకుంటున్నారా?.... పవన్ కళ్యాణ్ మూవీ తాజాగా రికార్డులు క్రియేట్ చేస్తుంది యూట్యూబ్‌లో. ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 'ఎవడు 3' పేరుతో విడుదలైంది.

విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అజిత్ నటించిన 'వివేగం' రికార్డును బద్దలు కొట్టింది. ఒక రోజులో ఎక్కువ మంది చూసిన సౌత్ డబ్బింగ్ చిత్రంగా రికార్డులకెక్కింది.
కేవలం రెండు రోజుల్లోనే 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నట్లు దీన్ని యూట్యూబ్‌లో విడుదల చేసిన గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. ఇంతకు ముందు ఎవడు, ఎవడు 2(గోవిందుడు అందరి వాడేలే) చిత్రాల హిందీ డబ్బింగ్ యూట్యూబ్ రికార్డులను సైతం 'ఎవడు 3'(అజ్జాతవాసి) చిత్రం అధిగమించింది.


Click it and Unblock the Notifications











