»   »  100 ఏళ్ల చరిత్రలో స్పెషలంటున్న త్రివిక్రమ్ (ఫోటోలు)

100 ఏళ్ల చరిత్రలో స్పెషలంటున్న త్రివిక్రమ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' చిత్రం జనవరి 4తో వందరోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం 100 డేస్ పోస్టర్లు వినూత్నంగా డిజైన్ చేసారు. 100 ఏళ్ల సినిమా చరిత్రలో ఈచిత్రం 100 రోజుల వేడుక ఎంతో స్పెషల్ అనే విధంగా ఈ పోస్టర్లు డిజైన్ చేసారు. తెలుగు సినిమా చరిత్రంలో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయిన నేపథ్యంలో ఈ పోస్టర్లు ఈ విధంగా డిజైన్ చేసారని స్పష్టమవుతోంది. అందరికీ థ్యాంక్స్ అంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతకం ఈ పోస్టర్లపై ఉండటం గమనార్హం.

సెప్టెంబర్ 27న 1200 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈచిత్రం....170 సెంటర్లలో 50 రోజులు వేడుక జరుపుకుంది. ఆ తర్వాత సైతం విజయవంతంగా ప్రదర్శితం అవుతూ....32 సెంటర్లలో జనవరి 4న వంద రోజులు పూర్తి చేసుకోబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈచిత్రం రికార్డులకెక్కింది.

మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది


పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.

హీరోయిన్లు

హీరోయిన్లు


పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఇద్దరూ హీరోయిన్లు తమ నటన, అందచందాలతో ఆకట్టుకున్నారు.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్


నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

అత్తారింటికి దారేది 100 డేస్ సెంటర్స్ లిస్ట్

అత్తారింటికి దారేది 100 డేస్ సెంటర్స్ లిస్ట్


నైజాం ఏరియాలో 4 సెంటర్లు
సీడెడ్ ఏరియాలో 11 సెంటర్లు
వైజాగ్ ఏరియాలో 1 సెంటర్
కృష్ణ జిల్లాలో 4 సెంటర్లు
గుంటూరు ఏరియాలో 4 సెంటర్లు
ఈస్ట్ గోదావరిలో 6 సెంటర్లు

English summary
Released in 1200 screens worldwide on September 27, Attarintiki Daredi had completed 50-day run in 170 screens. Despite doing well at the Box Office, the movie was forced to be withdrawn from many theatres due to several big releases. However, the movie is all set to complete 100 days in as many as 32 cinema halls on January 4.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu