twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ అభిమానిపై దాడి, కారణం అదేనా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ హడావిడిలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఈ ఆడియో పంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది.

    https://www.facebook.com/TeluguFilmibeat

    గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్ (31) పవన్ కల్యాణ్ అభిమాన సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు. హయత్‌నగర్‌లోని గంటవారిపాలెంలో నివాసముంటున్నాడు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ నటించిన గోపాల-గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన 20 టికెట్లను వేదిక వద్ద తన స్నేహితులకిస్తుండగా దుండగులు వచ్చి తమకూ కావాలని అడిగారు.

    నిరాకరించిన శ్రీనివాస్ గొంతు, మెడపై బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలి న శ్రీనివాస్‌ను అక్కడే ఉన్న పోలీసులు మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణహాని తప్పింది.

    Pawan Kalyan's fan stabbed at Gopala Gopala audio launch

    పవన్‌కల్యాణ్‌. దేవునిగా ఆయన కీలక పాత్ర చేసిన చిత్రం ‘గోపాల గోపాల'. వెంకటేశ్‌ ప్రధాన పాత్ర చేసిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకాలపై డి. సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి. రామానాయుడు సమర్పిస్తున్నారు. కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చిన పాటలు లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌, వెంకటేశ్‌ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

    పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. శ్రమ, కృషి మన చేతుల్లో ఉంది. దేవుణ్ణి నేను నమ్ముతాను. అయితే నిరాకారుడైన దేవుణ్ణి నమ్ముతాను. నాకోసం నేనెప్పుడూ దేవుణ్ణి ఏ కోరికా కోరుకోలేదు. ఒక్క హిట్టియ్యమని మాత్రం ఒక్క కోరిక కోరుకున్నా. నితిన్‌ ‘గుండెజారి గల్లంతయ్యిందే' ఆడియో వేడుకకు వచ్చి వెళ్తుండగా, అభిమానులు నా కారుకు అడ్డంపడి, ‘అన్నా ఒక్క హిట్టియ్యన్నా. రోడ్డుమీద తలెత్తుకు తిరగలేకపోతున్నాం' అని వేడుకున్నారు. చాలా బాధనిపించింది.

    ఇప్పుడు వరుస హిట్లొచ్చాయి. అభిమానులు నా మీద చూపించే ప్రేమ, ఆప్యాయతకు భగవంతుడు కరుణించాడు. వెన్నుచూపడం నాకు తెలీదు. నేను సినిమాల్లోకి రాక ముందునుంచీ వెంకటేశ్‌గారితో నాకు అనుబంధం ఉంది. ఎప్పట్నించో ఇద్దరం కలిసి సినిమా చెయ్యాలనుకుంటున్నాం. మేం కలిసినప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం.

    బహుశా ఈ సినిమా చెయ్యడానికి అదే కారణం అనిపిస్తోంది. ఇందులో దేవుడి కేరక్టర్‌ చేశాను. అందుకని ఒళ్లు దగ్గరపెట్టుకొని చేశాను. డాలీ మంచి దర్శకుడు. ఈ చిత్రాన్ని అతను తెరకెక్కించిన విధానం నచ్చింది. రాబోయే రోజుల్లో అతనితో ఓ సినిమానీ, అనూప్‌ రూబెన్స్‌ సంగీతంతో ఓ సినిమానీ చేస్తాను. సాధారణంగా పాటల్లో ఎక్కువగా నేను నడుస్తుంటాను. ఇందులో కాస్త కాలు కదిపాను'' అని చెప్పారు.

    English summary
    In a shocking turn of events, K Srinivas, a member of Pawan Kalyan's Fans Association from Guntur, was stabbed in the neck just before the audio launch of Gopala Gopala commenced in Hyderabad on Sunday evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X