»   » పవన్ కళ్యాన్ అభిమాని అయినందుకు పొడిచి చంపారు.. తిరుపతి జన సేన కార్యకర్తనే

పవన్ కళ్యాన్ అభిమాని అయినందుకు పొడిచి చంపారు.. తిరుపతి జన సేన కార్యకర్తనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ హీరోలమీద అభిమానం మన దేశం లో ఎంత ప్రభావ వంతంగా ఉంటుందో తెలిసిందే. ఇంక ఈ విషయం లో ప్రత్యేకించి సౌత్ సినీ అభిమానుల రూటే వేరు తమ మీదఒక మాత వచ్చినా ఊరుకుంటారేమో గానీ తమ అభిమాన హీరో మీద ఒక్క మాట తేడాగా వినిపించినా అక్కడ దుమ్ము రేగిపోవాల్సిందే. అయితే ఈ విషయం లో నార్త్ ఫ్యాన్స్ కాస్త వెనక అనే చెప్పుకోవాలి వాళ్ళు హీరోలని అభిమానిస్తారు గానీ వారి అభిమానం హద్దులు మీరదు.... రోడ్లమీదికెక్కదు...

ఒకప్పుడు తమిళ్ లోనే కనిపించే ఈ తరహా వీరాభిమానం కొన్నేళ్ళుగా తెలుగులోనూ కనిపిస్తోంది. ఇదిఎంత దాకా వెళ్లిందీ అంటే. హీరోల ని సినిమా.., నటన.. ల పరిదిని దాటి వారి సామాజిక వర్గన్ని బట్టి అభిమాన సంఘాల ఏర్పాటు వరకూ..., ఒక ఊరిలోనే రెండు వర్గాలుగా చీలిపోయేవరకూ.. కొన్నాళ్ళ క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య "పోస్ట్ర చించి వేత" వివాదం ఎక్కడిదాకా వెళ్ళిందో తెలిసిందే... ఇప్పుడు తాజా సంఘటన ఈ అభిమానం ఉన్మాదంగా మారిన పరిస్థికి అద్దం పడుతోంది... ఒక హీరో అభిమానులు పవర్ స్టార్ అభిమానిని హత్య చేసే వరకూ వెళ్ళింది.... ఆ వివరాలు....

ఇబ్బందికరంగా మారుతోంది

ఇబ్బందికరంగా మారుతోంది

సినిమా హీరోలపై జనానికి ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు.. ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటి ఘర్షణలకు దారితీస్తుండడమే ఇబ్బందికరంగా మారుతోంది.

ఆదివారం రోజు

ఆదివారం రోజు

రెండు రోజుల కిందట కర్ణాటకలో పవన్ కళ్యాణ్ అభిమాని మరో తెలుగు హీరో అభిమానులుగా భావిస్తున్న మరికొందరి మధ్య జరిగిన ఘర్షణలో పవన్ అభిమాని ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రెండు రోజుల తరువాత బయటికి తెలిసింది.

పవినోద్ రాయల్

పవినోద్ రాయల్

పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన తిరుపతి యువకుడు వినోద్ రాయల్ జనసేనకు సంబంధించి నగరంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. కోలార్ లో పవన్ కల్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి వినోద్ హాజరయ్యాడు.

పార్టీలో వేరే అభిమానులు

పార్టీలో వేరే అభిమానులు

కార్యక్రమం తర్వాత స్నేహితులతో పార్టీ లో వినోద్ కూర్చోగా... టాలీవుడ్ కే చెందిన ఓ యంగ్ హీరో అభిమాని, వినోద్ మధ్య చర్చ జరిగింది. తమ హీరో గొప్ప అంటే, కాదు తమ హీరో గొప్ప అంటూ వారిద్దిరూ గొడవకు దిగారు.

చర్చ రచ్చ అయ్యింది

చర్చ రచ్చ అయ్యింది

మొదట స్నేహితుల మధ్య పరాచికాలుగా మొదలైన చర్చ కాస్తా మధ్యం మత్తుతో రచ్చగా మారి గలాటాకు దారి తీసింది.

కత్తి తో పొడిచాడు

కత్తి తో పొడిచాడు

ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన యంగ్ హీరో అభిమాని వినోద్ ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వినోద్ ను అతడి మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినోద్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

వేరే కారణాలుండొచ్చేమో

వేరే కారణాలుండొచ్చేమో

తిరుపతికి వినోద్ మృతదేహాన్ని తీసుకురాగా... అతడి అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు.హత్యకు వేరే కారణాలేమైనా ఉండొచ్చన్న అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు.

అవాంచనీయం

అవాంచనీయం

హీరోల అభిమానుల మధ్య పెరిగిపోతున్న ఈ ధోరణి ఇప్పుడు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మరింత బాదించే విషయం ఏమిటంటే సదరు హీరోలు తమ వ్యక్తి గత జీవితాల్లో మంచి సంబందాలనే కలిగి ఉంటున్నారు.

అభిమానం, ద్వేషం

అభిమానం, ద్వేషం

కానీ వారిమీద మరీ ఎక్కువ అభిమానం పెంచుకున్న ఈ అభిమానులు మాత్రం.. గొడవలతో చిక్కుల్లో పడుతున్నారు. సమాజానికి మంచి చేసే అభిమనం మంచిదే గానీ ఇలా మనుషులనే వర్గాలు గా చీల్చేసే దోరణి అవాంచనీయమే.

వివాదాలు మామూలయ్యాయి

వివాదాలు మామూలయ్యాయి

తరుచూ అభిమాన సంఘాల మద్య భేదాభిప్రాయాలు రావడం విమర్శించుకోవడం చివరకు అవి కొట్టుకునే స్థాయి వరకు వెళ్లడం కామన్ గా జరుగుతుంది.అయితే మరోవైపు హీరోలు మాత్రం అభిమానుల అలా చేయవద్దని హిరోలం అందరం ఒకే గూటి పక్షులమని చెబుతుంటారు.కానీ ఆ మాటలను మాత్రం వ్య్వకులు పెడ చెవీ పెడుతూనే ఉన్నారు.

English summary
Pawan Kalyan Fan Tirupati city Janasena member Vinod Royal Murdered in Karnataka
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu