twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చర్చనీయంశం అయిన పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్ .. " శాంతియుతంగా ప్రయత్నిస్తా.. అప్పుడే యుద్ధం చేస్తా" అంటూ!

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రపంచం అంతా బాగానే రిలీజ్ అయినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పవన్ సినిమా మీద ఆంక్షలు విధించారు. ఏపీలో టికెట్ రేట్లు పెంచి అమ్మినా, బెనిఫిట్ షో వేసినా ఊరుకునేది లేదని చెబుతూ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ కలెక్షన్స్ మీద కూడా ఆ ప్రభావం పడింది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన మరో ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

    రెండింటినీ మేనేజ్ చేస్తూ

    రెండింటినీ మేనేజ్ చేస్తూ


    ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ వరుసగా మూవీస్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా గడుపుతున్న ఆయన మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కూడా చేస్తూ రెండింటినీ మేనేజ్ చేస్తూ ముందుకు వెళుతున్నారు.

    ఏదో రాస్తున్నట్లు

    అయితే ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల గురించి పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పలు సందర్బాల్లో గట్టిగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో మద్దతుదారులకు, వైసీపీ నేతలకు మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో పవన్ ట్విట్టర్‌లో పెట్టిన తాజా ట్వీట్ చర్చనీయాంశమైంది. జనసేన అధికారిక ఖాతా నుంచి షేర్ చేసిన దాని ప్రకారం ఏదో రాస్తున్నట్లు కనిపిస్తున్నారు పవన్.

    మాత్రమే యుద్ధం చేస్తా

    మాత్రమే యుద్ధం చేస్తా


    అందులో 'ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తాను, 100వ సారి మాత్రమే యుద్ధం చేస్తాను' అన్న కొటేషన్ ఆ ట్వీట్లో రాసి ఉంది. మొన్న కూడా ఆయన ప్రముఖ జర్మన్ వేదాంతి పాస్టర్ మార్టిన్ నిమొల్లర్ తెలిపిన మాటలను పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    మార్టిన్ నిమొల్లర్ మాటలను

    మార్టిన్ నిమొల్లర్ మాటలను


    'మొదట వారు సోషలిస్టులు కోసం వచ్చారు. అప్పుడు నేను సోషలిస్టు కాదు కాబట్టి మాట్లాడలేదు, ఆ తర్వాత వారు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కాబట్టి మాట్లాడలేదు, ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూదుడిని కాదు కాబట్టి. చిట్టచివరికి వారు నాకోసం వచ్చారు. అప్పుడు నాకోసం మాట్లాడటానికి ఎవరూ లేరు.' అని మార్టిన్ నిమొల్లర్ మాటలను, ఫోటోను ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    Bheemla Nayak Review: Pawan Kalyan And Rana Daggubati powerful Power-packed performance
    కలెక్షన్స్ విషయానికి వస్తే

    కలెక్షన్స్ విషయానికి వస్తే

    ఇక 'భీమ్లా నాయక్'కు 5వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు పెరిగాయి. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు నైజాంలో రూ. 2.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 89 లక్షలు, ఈస్ట్‌లో రూ. 74 లక్షలు, వెస్ట్‌లో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 43 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి రూ. 7.25 కోట్లు షేర్, రూ. 12.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

    English summary
    Pawan kalyan's latest tweet about war became hot topic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X