»   » పవన్ కళ్యాణ్-దాసరి సినిమా ఆగిపోయినట్లేనా?

పవన్ కళ్యాణ్-దాసరి సినిమా ఆగిపోయినట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కల్యాణ్-దాసరి నారాయణరావు కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే దాసరి నారాయణరావును ఇటీవల వైఎస్సార్‌సీపీ నేత జగన్ కలిసి మంతనాలు సాగించడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రాజకీయాల్లో రాణించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి దాసరి చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.

అప్పట్లో దాసరితో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఓ సెన్షేషన్. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అపుడు..ఇపుడు అంటూ వాయిదా వేస్తున్నారే తప్ప ఎప్పుడనే విషయం మాత్రం ఇద్దరూ తేల్చడం లేదు. ప్రస్తుతం పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగులో బిజీ.

Pawan Kalyan's Movie With Dasari Shelved?

పవన్ కళ్యాణ్ టీడీపీ మద్దతు దారుడిగా ఉన్నాడు, ఇపుడు దాసరి వైసీపి మద్దతు దారుడిగా మారడంతో పవర్ స్టార్ ఆయనతో సినిమా చేస్తాడా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? రాదా? అనేది కాలమే నిర్ణయించాలి.

దర్శకుడు ఖరారైనట్లు ప్రచారం జరిగింది కానీ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు ఓ సినిమా సరైన కథ లేక పోవడంతో ముందుకు సాగడం లేదని, మంచి కథ తయారు చేసే బాధ్యత సంపత్ నందికి దాసరి అప్పగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సంక్రాంతికి ఈ ప్రాజెక్టు గురించి దర్శకుడిని ఖరారు చేస్తూ దాసరి నుండి బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

English summary
Ever since T town is buzzing with talks that Dasari's project with Pawan may be shelved or perhaps postponed.
Please Wait while comments are loading...