»   » వావ్.....సర్దార్ గ్యాంగ్‌తో పవన్ కళ్యాణ్ సెల్ఫీ (ఫోటో)

వావ్.....సర్దార్ గ్యాంగ్‌తో పవన్ కళ్యాణ్ సెల్ఫీ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రం లోకేషన్లు పరిశీలించేందుకు గుజరాత్ వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగులో పాల్గొంటున్నాడు. సనిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ కు చాలా క్లోజ్ గా ఉండే వారిలో బ్రహ్మాజీ ఒకరు. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. తాజా ఆయన పవన్ కళ్యాణ్ తో దిగిన సెల్ఫీని పోస్టు చేసాడు. ఈ ఫోటో చూస్తుంటే పవన్ కళ్యాణే స్వయంగా ఈ సెల్ఫీ క్లిక్ మనిపించినట్లు స్పష్టమవుతోంది.


Pawan Kalyan's Selfie With Sardaar Gang

గతంలో ఓ సారి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తాను తన ఫోన్లో ఉండే ఇతర ఫీచర్లు ఎక్కువగా వాడను. కేవలం ఫోన్ ఆన్సర్ చేయడానికి గ్రీన్ బటన్, రిజెక్ట్ చేయడానికి రెడ్ బటన్ మాత్రమే వాడతాను అని చెప్పారు. ఇపుడు స్వయంగా పవన్ కళ్యాణే సెల్ఫీ క్లిక్ మనిపించడం చాలా రేర్ సంఘటనగా అభిమానులు పేర్కొంటున్నారు.


ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇక్కడ మరో రెండు రోజుల్లో షెడ్యూల్ ముగిస్తుంది. ఆ వెంటనే టీం అంతా కలిసి గుజరాత్ వెళ్లనున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

English summary
Pawan Kalyan, who is recently back from Gujarat after a location scouting, is now actively participating in Sardaar Gabbar Singh shoot in Hyderabad, without any major break between the schedules.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu