»   » పవన్ కళ్యాణ్ తీరుపై కొడుకు అకీరా ఆగ్రహం! ఎందుకు?

పవన్ కళ్యాణ్ తీరుపై కొడుకు అకీరా ఆగ్రహం! ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 8న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు మరో విశేషం కూడా ఉంది. పవన్ తనయుడు అకీరా నందన్ పుట్టినరోజు. ఇపుడు అకీరా వయసు 12 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసు పిల్లలు తమ పుట్టినరోజున తండ్రితో గడపాలని, అందరి కంటే ముందుగా తండ్రి నుండి బర్త్ డే శుభాకాంక్షలు పొందాలని, గిఫ్టులు అందుకోవాలని కోరుకుంటారు.

కానీ పవన్ కళ్యాణ్‌కు అసలు కొడుకు బర్త్ డే విషయమే గుర్తు లేదు. దీంతో కొడుకును విష్ చేయడం కూడా మరిచిపోయాడట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇటీవల ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అయితే ఎవరో గుర్తు చేయడంతో ఆరోజు రాత్రి ఫోన్ చేసి విషెస్ చెప్పాడట. నాన్న నుండి ఉదయం నుండి ఫోన్ కోసం ఎదురు చూసిన అకీరా... చాలా డిసప్పాయింట్ అయ్యాడట. ఆగ్రహానికి గురయ్యాడట.

తాను చాలా అరుదుగా పిల్లల బర్త్ డేలు గుర్తు పెట్టుకుంటానని, ఇప్పటికీ వారు ఏ క్లాస్ చదువుతున్నారో తనకు సరిగా తెలియదని అన్నారు పవన్ కళ్యాణ్. మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాన్ వెళ్లి తన కుమారుడిని కలిసి అతనితో కొంత సమయం గడుపనున్నారు. పవన్ కళ్యాణ్ తనకు ఉన్నస్టార్ డమ్ దృష్ట్యా ఆ ప్రభావం పిల్లలపై పడకుండా కావాలనే లైమ్ లైట్‌కి దూరంగా ఉంచుతున్నారట.

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోవడంతో అకీరా, ఆద్య తల్లితో కలిసి పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉంటూ అప్పుడప్పుడు వెళ్లి పిల్లలను కలిసి వస్తున్నారు. అకీరా భవిష్యత్తులో ఏరంగంపై ఇంట్రెస్టు చూపితే అటు వైపే పంపిస్తాం. వారసత్వంపై నాకు నమ్మకం లేదు. అభిమానులు కొందరు అకీరాను... లిటిల్ పవర్ స్టార్ పిలవడం నాకు అస్సలు నచ్చదు అని స్పష్టం చేసారు పవన్ కళ్యాణ్.

అకీరా నందన్

అకీరా నందన్


అకీరాన నందన్ 2004లో జన్మించాడు. ఇపుడు అతని వయసు 12 సంవత్సరాలు.

మహేష్ బాబు

మహేష్ బాబు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి అకీరా.

రేర్ పిక్

రేర్ పిక్


పవన్, అకీరా రేర్ పిక్.... ఎయిర్ పోర్టులో

తల్లితో..

తల్లితో..


తల్లి రేణు దేశాయ్ తో కలిసి అకీరా నందన్.

చెల్లితో..

చెల్లితో..


చెల్లి ఆద్యాతో కలిసి అకీరా నందన్... వారి పెంపుడు కుక్క కూడా!

హోలీ

హోలీ


అకీరా నందన్ హోలీ సెలబ్రేషన్స్ పిక్.

సినిమాల్లో..

సినిమాల్లో..


ఇష్క్ వాలా లవ్ చిత్రం ద్వారా అకీరా నందన్ తెరంగ్రేటం చేసాడు. ఈ చిత్రానికి దర్శకత్వం రేణు దేశాయ్.

పెదనాన్నతో..

పెదనాన్నతో..


పెద్దనాన్న చిరంజీవితో కలిసి అకీరా నందర్ చిన్నతనంలో...

తీన్ మార్..

తీన్ మార్..


పవన్ కళ్యాణ్ మూవీ తీన్ మార్ సినిమా సెట్లో...

సినీ వేడుకలో..

సినీ వేడుకలో..


సినీ వేడుకలో తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి అకీరా నందన్.

English summary
Pawan Kalyan's Sardaar Gabbar Singh released on 8 April, on the occasion of Ugadi and the day also marks the birthday of his son, Akira Nandan. However, Akira was disappointed with his dad Pawan Kalyan and Pawan Kalyan himself revealed it, in one of his recent interviews.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu