»   » 'శ్రీమంతుడు'కు సపోర్ట్ కోసమా?: పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాతో మహేష్ బాబు

'శ్రీమంతుడు'కు సపోర్ట్ కోసమా?: పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాతో మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి ఉన్న ఫోటో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అకీరా నందన్ ఆగస్టు 5న, బుధవారం మహేష్ బాబును కలిశాడు. ఇది సామాజిక అనుసంధాన వేదికలో ఉంది.

పవన్ తనయుడు మహేష్ బాబుతో కలిసి ఫోటో దిగడం పైన ట్విట్టర్ లో విపరీతమైన స్పందన వస్తోంది. మద్దతుగా, సెటైరిక్ స్పందనలు వస్తున్నాయి.

Pawan Kalyan's son Akira with Mahesh Babu

శ్రీమంతుడు సినిమాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను సపోర్ట్ చేయమని మహేష్ బాబు పరోక్షంగా కోరుతున్నారా అంటూ ఒకరు పోస్ట్ చేశారు. ఇది సూపర్ అంటూ మరొకరు పోస్ట్ చేశారు.

కాగా, మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

English summary
Power Star Pawan Kalyan's son Akira Nandan with Super Star Mahesh Babu.
Please Wait while comments are loading...