»   » పవన్ ‘తొలిప్రేమ’అరుదైన రికార్డులు(ఫొటో ఫీచర్)

పవన్ ‘తొలిప్రేమ’అరుదైన రికార్డులు(ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా సరిగ్గా పదహారేళ్ల క్రితం(జూలై 24, 1998)నాడు విడుదలైన చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రం పవన్ కెరీర్ కి ఇచ్చినంత బూస్టప్ మరే చిత్రం ఇవ్వలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో సీన్స్ ఎంతగా జనాలకు నచ్చేసాయంటే...లాంగ్ రన్ కి కారణం ఈ సన్నివేశాలే అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ చిత్రంలో పాత్రలు,సన్నివేశాలు లాంటివి క్రియేట్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటేనే ఈ చిత్రం గొప్పతనం అర్దం చేసుకోవాలి.

ముఖ్యంగా ఈ చిత్రంలో కీర్తి రెడ్డి ఇంట్రడక్షన్ సీన్... ఓ క్లాసిక్ గా హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ లో ఒకటిగా మిగిలిపోయింది. అలాంటి సన్నివేశాలు...అనుకరిస్తూ చాలా వచ్చినా అవి అనుకరణగా మిగిలిపోయాయి కానీ ఈ ఇంట్రడక్షన్ సీన్ కి సరితూగేది రాలేదు. ఈ చిత్రంలో ఇలాంటి హైలెట్స్ చాలా ఉండబట్టే ఇంతకాలం అయినా ఈ చిత్రం టీవీ ఛానెల్స్ లో వస్తూంటే టీఆర్పీలు అదిరిపోతున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ ...ఓ మధ్యతరగతి సామాన్య కుర్రాడిగా నటించిన ఈ చిత్రంలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. అలాగే ఆ హైలెట్స్ మరెన్నో అరుదైన రికార్డులు క్రియేట్ చేయటానికి దోహదం చేసాయి. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, బ్రదర్,సిస్టర్ సెంటిమెంట్, వేణు మాధవ్ కామెడీ, దేవా పాటలు ...ఇలా ఒకటేమిటి...ఎన్నో ఈ సినిమాను ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో రికార్డులు ఒకసారి గుర్తు చేసుకుందాం.

రేర్ రికార్డులు,విశేషాలు ...స్లైడ్ షోలో....

మోతిక్కిన రికార్డులు

మోతిక్కిన రికార్డులు

హైదరాబాద్ - సంధ్య 70MM - 217 రోజులు

గుంటూరు - లిబర్టీ - 224 రోజులు

వరంగల్ - రామ్ లక్ష్మణ్ - 300 రోజులు

హండ్రడ్ డేస్...

హండ్రడ్ డేస్...

ఈ చిత్రం పైన చెప్పిన థియోటర్స్ లో కాకుండా 21 సెంటర్లలలో వంద రోజులు పాటు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. అది అప్పటివరకూ పవన్ కళ్యాణ్ కు ఉన్న రికార్జులును ఒక్కసారిగా బ్రద్దలు కొట్టింది.

ఆశ్చర్యకరమైన రికార్డ్

ఆశ్చర్యకరమైన రికార్డ్

ఈ సినిమాలోని పాటల్లో ఎక్కడా ఫిమేల్ వాయిస్ అనేది వినపడదు. అదో విచిత్రం. అదో రికార్డు.

అవార్డులు

అవార్డులు

ఈ చిత్రం కమర్షియల్ గా ఘన విజయం సాధించటమే కాకుండా... ఆరు నంది అవార్డులు, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు సంపాదించింది.

రీమేక్ , డబ్బింగ్

రీమేక్ , డబ్బింగ్

ఈ సినిమా హిందీలోకి ముజే కుచ్ కెహనా హై అనే టైటిల్ తో రీమేక్ చేసారు. తుషార్ కపూర్, కరీనా కపూర్ చేసారు. అలాగే కన్నడంలో...Preethsu Thappenila తో రవిచంద్రన్ రీమేక్ చేసారు. అలాగే తమిళంలోకి ఆనంద మాజై టైటిల్ తో డబ్ చేసారు. రీమేక్, డబ్బింగ్ రైట్స్ కి వచ్చిన మొత్తం...బడ్జెట్ మొత్తానికి సమానమని చెప్పుకున్నారు.

రెమ్యునేషన్ తగ్గించుకుని మరీ..

రెమ్యునేషన్ తగ్గించుకుని మరీ..

ఈ చిత్రం లో ఉన్న గగనానికి ఉదయం ఒకటే పాటలో కనపడే తాజ్ మహల్ సెట్ వేయటం కోసం అయ్యే ఖర్చుని తన రెమ్యునేషన్ నుంచి భరించారు పవన్. అందు నిమిత్తం తన రెమ్యునేషన్ లో తగ్గించి తీసుకుని, సినిమా బాగా రావాలనే తాపత్రయంతో పని చేసారు.

బైక్

బైక్

ఈ చిత్రంలో పవన్ వాడిన బైక్ అప్పట్లో ప్రత్యేకార్షణ... 2 స్ట్రోక్ RX-100 కి మోడిఫైడ్ వెర్షన్ గా 4 స్ట్రోక్ తో చూపారు.

కవిత చెప్పి...సినిమా

కవిత చెప్పి...సినిమా

ఈ చిత్రంతో దర్శకుడుగా మారిన కరుణాకరన్ ని... క్లుప్తంగా కథేంటి... అని అడిగారు పవన్ కళ్యాణ్ ... కథ అడిగితే నేను కవిత చెప్పా అంటూ దర్శకుడు కరుణాకరన్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. తొలిప్రేమ చిత్రం ఎలా మొదలైందో సాక్షి ఫీచర్ కు వివరిస్తూ ఆయన ఇలా స్పందించారు. ఇంతకీ ఆయన చెప్పిన కవిత ఏమిటంటే... ‘నేను ప్రేమించిన అమ్మాయి నా పక్కనే ఉంది కానీ బాధగా ఉంది. ఎందుకంటే ప్రేమ లేదు. ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్లిపోయింది. కానీ బాధ లేదు. ఎందుకంటే ప్రేమ ఉంది.' అన్నారు. ఆ కథనే సినిమా చేసానన్నారు. దాంతో పవన్ ఇంప్రెస్ అయ్యారు.

సినిమా మ్యాగజైన్ పై ఫొటో చూసి...

సినిమా మ్యాగజైన్ పై ఫొటో చూసి...

ఒకరోజు పాండీ బజార్‌లో సినిమా మ్యాగజైన్‌లో పవన్ కల్యాణ్ ఫొటో చూశారు కరుణాకరన్. చూడగానే తన కథకు అతనే కరెక్ట్ అనిపించింది. అతనెవరని ఆరా తీస్తే, చిరంజీవిగారి తమ్ముడని తెలిసింది. మద్రాస్‌లో ఉన్న వాళ్ల బంధువు ద్వారా ప్రయత్నిస్తే చాలా రోజులకు ఆయన అపాయింట్‌మెంట్ దొరికింది. ఆ క్షణంతో కరుణాకరన్ పదేళ్ల పోరాటానికి ఒక ముగింపు దొరికింది.

హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఇలా...

హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఇలా...

కరుణా కరన్ ఆ సీన్ గుర్తు చేసుకుంటూ...ఒకరోజు దీపావళి పండుగకు బస్సు దిగి మా ఊళ్లోకి నడుస్తున్నప్పుడు ఆ చీకట్లో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. చీకట్లో మతాబులు కాలుతున్నప్పుడు ఆ వెలుగు రవ్వల మధ్య ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ క్షణం ఒక అద్భుతమైన కవితలా నా మనసులో గాఢంగా ముద్రించుకుంది అదే తెరపై పెట్టాను అన్నారు.

పవన్ సాహసం

పవన్ సాహసం

కొడెకైనాల్‌లో ఈ చిత్రం షూటింగ్ సమయంలో కార్ యాక్సిడెంట్ సీన్ తీస్తున్నప్పుడు రోప్ తెగిపోయి లోపల ఉన్న హీరో హీరోయిన్ల డూప్‌లు చిన్న లోయలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు పవన్ వెంటనే కిందకు దూకి లోపల ఉన్న వాళ్లను రక్షించారు. అలా ఏ విషయంలోనైనా ఆయన ముందుండి మొత్తం యూనిట్ ని నడిపించారు.

మొదటి షాట్

మొదటి షాట్

ఈ చిత్రంలో... మొదటి సీన్ పవన్ కల్యాణ్ మంచంలో పడుకున్నప్పుడు, ముఖం మీద నుంచి తల్లి దుప్పటిలాగే షాట్ తీశారు కరుణాకరన్. ఆ షాట్‌నే మొదటి సీన్‌గా తీయాలని పట్టుబట్టి తీశారు. ఎందుకంటే శివాజీ గణేశన్ మొదటి సినిమా మొదటి షాట్ కూడా ఇలాగే తీశారనే సెంటిమెంట్‌తో ఆయనా అలాగే చేశారు.

English summary

 Pawan Kalyan’s ‘Tholi Prema’ directed by Karunakaran is completing 16 years after release by today (July 24, 2014). Here are some Tholi Prema rare records.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu