»   » అన్నయ్య వస్తున్నాడు, వారిని రానివ్వొద్దు: ఫ్యాన్స్‌కి పవన్ పిలుపు

అన్నయ్య వస్తున్నాడు, వారిని రానివ్వొద్దు: ఫ్యాన్స్‌కి పవన్ పిలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక రేపు(మార్చి 20) హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరుగబోతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల ఉద్దేశించి కొన్ని సూచనలు చేసారు.

పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని, పాసులు లేని వారు ఇంటి వద్ద టీవీల్లో ఆడియో వేడుక చూడాలని పవన్ కోరారు. పాసులు లేని వారు ఆడియో వేడుక వేదిక వద్దకు వచ్చి అక్కడ గుమిగూడి ఇబ్బందులు కలిగించవదని, అసాంఘీక శక్తులకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. గతంలో గోపాల గోపాల ఆడియో వేడుక సంఘటన సందర్భంగా జరిగిన ఓ సంఘటనను పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసారు.

ఆడియో వేడుక జరిపేందుకు నోవాటెల్ హోటల్ వారి నుండి అనుమతి తీసుకున్నప్పటికీ... పోలీసులు సెక్యూరిటీ పరమైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసారు, ఫారిన్ డెలిగేట్స్ ఉండే ఈ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పాసులు లేని అభిమానులు ఇక్కడికి వచ్చి గుమికూడొద్దనే తాను ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు పవన్ తెలిపారు.

Pawan Kalyan

నోవాటెల్ లో కాకుండా నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఆడియో వేడుక జరుపాలని చూసాం... కానీ అక్కడ కూడా కొన్ని సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. చివరకు నోవాటెల్ హోటల్ లో ఆడియో వేడుక ఓకే చేసాం. పాసులు ఉన్న అభిమానులు మాత్రమే వచ్చి క్రమశిక్షణగా మెలగాలని పవన్ కళ్యాణ్ కోరారు

ఆడియో వేడుకకు తెలంగాణ ప్రభుత్వం నుండి మంచి సహకారం అందింది. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు. సహకరించిన పోలీసులు అధికారులు సివి ఆనంద్ గారికి, అనురాగ్ శర్మ గారికి పవన్ థాంక్స్ చెప్పారు.

నాకు వ్యక్తిగతంగా ఆడియో ఫంక్షన్స్ ఇష్టం ఉండదు. సినిమా ప్రమోషన్స్ కోసం తప్పడం లేదు. అభిమానులు దెబ్బ తగిలి ఇంటికెళితే బాధ నాకే ఉంటుంది. చిరంజీవిగారిని ఆడియో వేడుకకు ఇన్వైట్ చేసాం, జాని తర్వాత నేను రాసిన స్క్రిప్టుతో సినిమా చేసాను. నేను సినిమాల నుండి తప్పుకుంటున్నాను అనే వార్తలో వాస్తవం లేదు అన్నారు పవన్ కళ్యాణ్.

నేను సినిమాలను సినిమాగానే చూస్తాను...పొలికల్ దృష్టిలో చూడను అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హిందీలోకి వద్దు అని వర్మ అంటున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా....వర్మ ఓపీనియన్ గౌరవిస్తాను అన్నారు. ఏ సినిమాతోనూ పోటీ పడాలని అనుకోను అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

English summary
Pawan Kalyan's Sardar Gabbar Singh Press meet details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu