twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్యూమినియం ప్యాక్టరీలో పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్స్ గా నిలుస్తాయంటున్నారు. నైట్ ఎఫెక్ట్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయి. ఈ ఫైట్ మరికొన్ని రోజులు షూట్ జరుగుతుంది. తర్వాత ఓ పాటను తెరకెక్కిస్తారు.

    అలాగే ఈ చిత్రం మొదటి టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేయటానికి నిర్ణయంచారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ టీజర్ అభిమానులు మధ్య విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో పుట్టిన రోజు వేడుకలు,టీజర్ విడుదల జరగనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు. ఇక ఈ చిత్రం బిజినెస్ కూడా మంచి క్రేజ్ తో మొదలైంది.

    పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొన్న ఓ రోజు అనుకున్నారు కానీ వర్షం రావటం తో కుదరలేదు. ఇక పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.

    'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

    English summary
    Pawan Kalyan's upcoming movie Cameraman Gangatho Rambabu shooting is progressing rapidly in Hyderabad. Director Puri Jagannath is currently filming action sequences on Pawan Kalyan and others at Alluminium factory in Hyderabad. Production sources further say that these action episodes in the night effect will be shown before interval bang in the film. The unit will canned these scenes for another couple of days before commencing the song shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X