twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రమాదం: పవన్ కొడుకు పట్ల వైద్యుల నిర్లక్ష్యం, చనిపోవడం మేలంటూ రేణు ఫైర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అకీరా సైకిల్ తొక్కుతుండగా కింద పడిపోవడంతో గాయాలు కాస్త తీవ్రంగానే అయ్యాయి. వెంటనే అకీరాను ఆసుపత్రికి తీసుకెళ్లినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నొప్పి తట్టుకోలేక పిల్లాడు అల్లాడిపోయారు. దీంతో అకీరా తల్లి రేణు దేశాయ్ వైద్యుల తీరుపై ఫైర్ అయింది.

    'అకీరా సైకిల్ మీద నుండి కిందపడి గాయపడ్డారు. వెంటనే మంచి ఆసుపత్రికి తీసుకెళ్లాను. అయితే అక్కడ మాకు చేదు అనుభవమే ఎదురైంది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వెయిట్ చేయించారు. ఆలస్యంగా వైద్యం చేసారు. అప్పటి వరకు అకీరా బాధ చూసి మన మనసు విలవిలాడింది. పెద్ద ఆసుత్రులకు ట్రీట్మెంటు కోసం వెళ్లడం కంటే నేరుగా చనిపోవడం మేలు అంటూ రేణు దేశాయ్ తన మనసులోని ఆక్రోశాన్ని వెల్లగక్కారు.

    కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బులు భారీగా గుంజడంతో పాటు ఇలా నిర్లక్ష్యం కూడా చోటు చేసుకున్న సందర్భాలు అనేకం. ఇపుడు సెలబ్రిటీలకు ఈ తిప్పలు తప్పడం లేదు. డాక్టర్ల నుండి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం వహించి మానవత్వాన్ని చంపేస్తోంది అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు.

    పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత ప్రస్తుతం రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణెలో ఉంటున్నసంగతి తెలిసిందే. ఈ సంఘటన పూణెలో జరిగిందికానీ... హైదరాబాద్ లో జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానుల చేతిలో ఆ ఆసుపత్రి పని అయిపోయేదే!

    English summary
    "Akira had bad cycle accident,got him to one of d best hospitals&inspite of seeing an injuredchild d delay in treatmnt&waiting&insensitivity. Rather, directly die,than go to big hospitals for treatments!The insensitivity of the entire system frm docs to nurses kills d human spirit!" Renu Desai tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X