twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ స్పీచ్ సంక్రాంతి సంబరాలు(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాలో స్వర్ణభారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు వేసిన రంగవల్లికలను నేతలు తిలకించారు. అనంతరం ఏర్పాటుచేసిన వేదిక వద్దకు వెంకయ్యనాయడు, ఫడణవీస్‌, పవన్‌కల్యాణ్‌ హాజరవడంతో అభిమానుల సందడి నెలకొంది. పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు యువత పోటీపడ్డారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పూర్తి దాయక స్పీచ్ ని ఇక్కడ మీరు వీక్షించండి.

    ‘‘స్వచ్ఛ భారత్‌ గురించి మోదీ మాటలు విన్నప్పుడు నేను కూడా అనుమానించాను. ఇది సాధ్యమా అని అనిపించింది. అయితే, దాన్ని సాధ్యం చేయడం ఒకరిద్దరితోనే అయ్యేది కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యత పడాల్సి ఉంటుందని ఆ తరువాత తెలుసుకొన్నాను. అందువల్లనే నా వంతుగా నేను స్వచ్ఛభారత్‌లో పని చేస్తాను. నా అభిమానులకు కూడా ఇదే పిలుపునిస్తున్నాను'' అని చెప్పారు. దేశంలో ఇల్లు లేకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్లు కనిపిస్తున్నాయని, కానీ, కనీస అవసరాలను మాత్రం తీర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

    Pawan Kalyan Speech At Sankranti Celebrations in Nellore

    నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘సంక్రాంతి సంబరా'ల్లో ఆత్మీయ అతిఽథిగా పాల్గొన్నారు. తనదైన శైలిలో నేతలకు చురకలు అంటిస్తూ పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం సాగింది.

    పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్‌ అంటే.. భారతీయ జనతా పార్టీనో, ప్రధాని మోదీనో కాదు. ప్రతి భారతీయుడి భాగస్వామ్యం ఉన్నప్పుడే అది సాధ్యం. సంవత్సరంలోనో లేదంటే ఐదేళ్లలోనో భారత్‌ను పరిశుభ్ర దేశంగా మార్చడం కుదిరే పనికాదు. భారతదేశం ఉన్నంతకాలం ఈ కార్యక్రమం కొనసాగాలి'' అని తెలిపారు.

    ‘‘స్వచ్ఛభారత్‌ అంటే ఫొటోలు తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే పరిశుభ్రమైన సమాజం అవతరిస్తుంది'' అని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్వచ్ఛభారత్‌ ప్రచారం కోసం తెలుగు రాష్ర్టాల నుంచి ఎంపికచేసిన ప్రముఖుల్లో ఒకరైన పవన్‌ కల్యాణ్‌, తొలిసారి ఈ కార్యక్రమంపై స్పందించారు.

    అలాగే... ‘‘టెక్నాలజీ పరంగా దేశం ఎంతో అభివృద్ధిని సాధించింది. కానీ, అదేదీ మనిషి అవసరాలకు ఉపయోగపడడంలేదు. ఇప్పటికీ ఆడబిడ్డలకు మరుగుదొడ్లు లేవు. ఉన్నావాటికి తలుపులు లేవు'' అని వాపోయారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సిద్ధాంతం కోసం నిలిచే నేత అని, విభజనపై ఆయన ఒక్కరే పార్లమెంటులో పోరాడారని గుర్తు చేశారు.

    Pawan Kalyan Speech At Sankranti Celebrations in Nellore

    ఇక ‘‘నేను నెల్లూరులోనే పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచి వెంకయ్యనాయుడును చూస్తున్నాను. మా నాన్న ఆయనతో కలిసి జై ఆంధ్రా ఉద్యమంలో పోరాడారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ను వెంకయ్య నెల్లూరుకు తీసుకువచ్చారు'' అని చెప్పారు. విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు అలవర్చుకున్న యువకులు ఉన్నత శిఖరాలను అందుకుంటారని.. అందుకు మహారాష్ట్ర యువ ముఖ్యమంత్రి దేవేందర్ర ఫడ్నవీసే మంచి ఉదాహరణ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

    దేశ భవిష్యత్‌ యువత చేతిలో ఉందని.. అనంతరం మాట్లాడిన ఫడ్నవీస్‌ అన్నారు. క్రమశిక్షణ కలిగినవారే విజయాలు అందుకుంటారు. నటుడు పవన్‌కళ్యాణ్‌లో ఈ గుణాన్ని నేను చూశాను. ఆయన అభిమానులు సైతం.. అదే బాటలో నడవాలి'' అని ఆయన కోరారు. ‘స్వర్ణభారత్‌' నిర్వహిస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నది''అని అన్నారు.

    English summary
    Pawan Kalyan at Nellore Swarna Bharathi trust yesterday. He campaigned for ‎SwachhBharath‬ mission, interacted with school children & participated in Sankranti Celebrations there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X