twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి, వర్మ ఇష్యూ: మీడియా కుట్రపై పవన్ యుద్ధం.. పేర్లతో సహా బయటపెట్టాడు, ఎప్పుడూ వినని మాట!

    |

    Recommended Video

    Pawan Kalyan Starts Tweets War On Telugu News Channels On Sri Reddy Issue

    గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ని కుదుపేస్తున్న నటి శ్రీరెడ్డి వ్యవహారంలో అనేక ఊహించని మలుపులు చోటు చేసుకున్నా సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న పోరాటం విషయంలో అందరి మద్దత్తు లభించింది. కానీ ఆమె కొందరు ప్రముఖులు తనని వాడుకుని వదిలేశారంటూ ఆరోపించి పేర్లు, ఫోటోలు బయట పెట్టింది. కానీ వారిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కేవలం మీడియా చర్చలకు మాత్రమే పరిమితం కావడంతో కొన్ని అనుమానాలు తలెత్తాయి. ఆమె ఉహించని విధంగా పవన్ కళ్యాణ్ తల్లిపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో కాస్టింగ్ కౌచ్ పోరాటం కొత్త మలుపు తిరిగింది. శ్రీరెడ్డిని అలా తిట్టమని చెప్పింది తానే అని వర్మ నిస్సిగ్గుగా ముందుకు రావడంతో దీనుక పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతోందని సినీ రాజకీయా వర్గాలు గ్రహించాయి. స్వయంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాజగా పవన్ కళ్యాణ్ ఈ కుట్రలపై యుద్ధం మొదలు పెట్టారు.

    నా తల్లి గౌరవం కాపాడుకోలేకుంటే

    పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇలాంటి ఎమోషనల్ వ్యాఖ్యలు ఎప్పుడూ, ఎవరూ వినివుండరు. నా తల్లి గౌరవం కాపాడుకోలేకుంటే నేను చనిపోవానే మంచిది అంటూ పవన్ ట్విట్టర్ వేదికగా యుద్ధం మొదలు పట్టారు. స్వశక్తితో జీవించే వాడు,, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏక్షణానైనా చనిపోవడానికి సిద్ధపడితే ఓటమికి బయటపడతాడా అంటూ ప్రశ్నించారు.

    ఒకవేళ నేను చనిపోతే

    పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో మరో ఎమోషనల్ ట్వీట్ చేసారు. అభిమానులకు ఉద్దేశించి పవన్ చేసిన ట్విట్ చాలా ఎమోషనల్ గా ఉంది. ఈరోజు నుంచి ఏక్షణమైనా చనిపవడానికి సిద్ద పడే తాను ఈ పోరాటంలోకి దిగానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ తాను ఈ ప్రాతంలో చనిపోతే నిస్సహాయులకు అండగా అటూ, రాజ్యాంగ బద్దంగా పోరాటం చేసి చనిపోయాడని అభిమానులు అంటుకుంటే చాలని పవన్ అన్నారు.

    మీడియా దిగజారిన విషయాన్ని

    దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన తన తల్లిని నడిరోడ్డులో ఓ మహిళా చేత అనకూడని మాట అనిపించి, దానిపై అదేపనిగా డిబేట్లు పెట్టారని మీడియాని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    మీడియా ఛానల్స్ కుట్ర

    ఏపీ మంత్రి లోకేష్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. లోకేష్ గత ఆరునెలలుగా ప్రముఖ మీడియా సంస్థలు టివి9,ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరియు కొన్ని ఇతర ఛానల్స్ తో కుట్ర పన్ని తనని, తన కుటుంబాన్ని, అభిమానులని టార్గెట్ చేస్తూ మీడియా అత్యాచారం జరిపించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

    పేర్లు బయట పెట్టిన పవన్ కళ్యాణ్

    దర్శకుడు రాంగోపాల్ వర్మ, టివి9 రవిప్రకాష్, టివి9 ఓనర్ శ్రీనిరాజు, నారాలోకేష్ తోపాటు అతడి స్నేహితుడు రాజేష్ కిలారు 10 కోట్ల కుట్ర పన్నిన సంగతి చంద్రబాబుకు తెలియదా అంటూ పవన్ ప్రశ్నించారు.

    ఆ ధైర్యం ఉందా

    తనపై మీడియా చర్చలు పెడుతున్నట్లు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ పై పెట్టగలరా అంత ధైర్యం మీకు ఉందా అంటూ పవన్ కళ్యాణ్ మీడియా ఛానల్స్ అధినేతలని ప్రశ్నించారు. కొన్ని మీడియా ఛానల్స్ పై, చంద్రబాబు, లోకేష్ పై పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్స్ సినీరాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి.

    English summary
    Pawan Kalyan starts war against son news channels over SriReddy issue. Pawan Kalyan sensational tweets became hot topic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X