»   »  రాంచరణ్‌ కోసం తప్పుకొన్న పవన్ కల్యాణ్.. అసలేం జరిగిందటే..

రాంచరణ్‌ కోసం తప్పుకొన్న పవన్ కల్యాణ్.. అసలేం జరిగిందటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అందరూ ఈ సినిమా దసరా బరిలో నిలుస్తుందని అందరూ ఆశించారు. కానీ ప్రస్తుతం దసరా రేసు నుంచి ఈ సినిమా తప్పుకొన్నట్టు తెలుస్తున్నది. అయితే అబ్బాయి రాంచరణ్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాను వాయిదా వేసుకొన్నట్టు సమాచారం.

  రంజుగా దసరా పోటీ

  రంజుగా దసరా పోటీ

  ఈ ఏడాది దసరా పోటీ మరీ రంజుగా కనిపిస్తున్నది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ పండగ బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రం సెప్టెంబర్ 29న రిలీజ్ కానున్నది. ఈ చిత్రానికంటే ఒకవారం ముందు జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశతో వస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ సినిమా కూడా దసరా బరిలో ఉండే అవకాశం ఉందనే మాట వినిపించింది.

   బరిలో రాంచరణ్ రంగస్థలం

  బరిలో రాంచరణ్ రంగస్థలం

  ఇదిలా ఉండగా, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ కూడా దసరా పోటీకి సిద్దమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 1985 రంగస్థలం సినిమాను దసరాకు ప్రేక్షకులకు అందించాలని సిద్దం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సినిమాను వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

  రిలీజ్ వాయిదా వేసుకొన్న పవన్

  రిలీజ్ వాయిదా వేసుకొన్న పవన్

  పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతున్నది. ఈ సినిమా పేరు ఇంకా పెట్టనప్పటికీ.. గోపాలకృష్ణుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

  వాయిదా పడుతున్న స్పైడర్

  వాయిదా పడుతున్న స్పైడర్

  అలాగే దసరాకు వస్తుందనుకొన్న మహేశ్ స్పైడర్ కూడా వెనక్కి తగ్గింది. ఈ చిత్ర రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదా పడుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

  English summary
  Power Star Pawan Kalyan and Trivikram Srinivas' forthcoming flick is hitting the headlines ever since it has been announced. Earlier, there were rumors that Pawan Kalyan's untitled flick is scheduled to release on the eve of Dasara. Ram Charan is going to join Dasara race to compete with these actors. Sources informed that he also plans to release his forthcoming flick 1985 Rangasthalam in September month to grab the audience attention.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more