»   » నా సినిమా చూసి , పవన్ విషెష్ చెప్తూ ప్లవర్ బొకే పంపారోచ్

నా సినిమా చూసి , పవన్ విషెష్ చెప్తూ ప్లవర్ బొకే పంపారోచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చూసి బాగుందని మెచ్చుకుంటూ ఆ హీరోకు బొకేకి పంపారంటే ఆ హీరో పరిస్దితి ఏమిటి..ఆ ఆనందం ఇంతని చెప్పగలమా...ఇప్పుడు అలాంటి ఆనంద క్షణాలనే ఆశ్వాదిస్తున్నాడు కమిడియన్ శ్రీనివాస రెడ్డి.

తాజాగా పవన్ కళ్యాణ్ ... తనతో చిత్రాల్లో కమిడియన్ గా చేసిన శ్రీనివాస రెడ్డి హీరోగా చేసిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా చూసి అతన్ని అభినందిస్తూ ఫ్లవర్ బొకే కూడా పంపారు. పవన్ నుంచి ఊహించని ఈ అభినందనతో థ్రిల్ ఫీలైన శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెబుతూ పవన్ కు థ్యాంక్స్ చెప్పారు.

Pawan Kalyan surprises star comedian Srinivasa Reddy


పవన్ తాజాగా ఈ సినిమా చూసి 'నువ్వొక మంచి సినిమా చేశావు. సినిమా చూసి ఎంజాయ్ చేశాను. నీకు నా బెస్ట్ విషెస్' అని అభినందిస్తూ ఒక గులాబీ బొకేని శ్రీనివాస్ రెడ్డికి పంపారు.


శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే హీరోగా 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో తోలి అడుగువేశారు. శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా రూపొందిన 'జయంబు నిశ్చయంబురా' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిది. ఆ సినిమా ప్రేక్షకులను, విమర్శకులను బాగా మెప్పించింది. నటుడిగా శ్రీనివాస్ రెడ్డి స్థాయిని కూడా పెంచింది. సినిమా చూసిన చాలా మంది శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు.

English summary
Srinivasa Reddy got a surprise flower bouquet from none other than Power star Pawan Kalyan. The news is that after watching the film, Pawan liked the movie so much that he wrote a special note to Reddy saying” You made a good film. I enjoyed it. Best wishes”.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu