»   » పవన్ కళ్యాణ్ నిర్మాతగా... రామ్ చరణ్ సినిమా!

పవన్ కళ్యాణ్ నిర్మాతగా... రామ్ చరణ్ సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా కుటుంబంలో విబేధాలు ఉన్నాయంటూ... చిరంజీవి, రామ్ చరణ్‌లతో పవన్ కళ్యాణ్‌కు పడటం లేదంటూ చాలా కాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటివేమీ లేదని మెగాహీరోలంతా గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసారు. అయినా ఆ వార్తలకు తెర పడలేదు. అయితే ఇవన్నీ కేవలం పుక్కిటి పుకార్లే అని మరోసారి తేటతెల్లం అయంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయబోతున్నారు. అయితే ఈ ఇద్దరూ ఏదో కలిసి నటిస్తారు.... రామ్ చరణ్ సినిమాలో పవన్ కళ్యాణో, లేక పవన్ కళ్యాణ్ సినిమాలో రామ్ చరణో గెస్ట్ రోల్స్ చేస్తారేమో అనుకుంటే పొరపాటే. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాను స్వయంగా పవన్ కల్యాణ్ నిర్మించబోతున్నారు.

Pawan Kalyan To Produce A Film With Ram Charan

2016 ప్రథమార్థంలో పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ రోజు జరిగిన ఓ వాణిజ్య కార్యక్రమంలో రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించడాన్ని బట్టి ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే తెర వెనక కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు కథ ఎవరు అందిస్తున్నారు? దర్శకత్వం వహించేది ఎవరు? హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు? లాంటి విషయాలేవీ బయటకు రాలేదు. చిరంజీవి 150వ సినిమా ప్రారంభం అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అకవాశం ఉంది. రామ్ చరణ్ ప్రకటనతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

English summary
Ram Charan has been surprising his fans with back to back mesmerizing news. The latest to come from him is, Pawan Kalyan will be producing a film with Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu