»   »  పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీలో కూడా... (పోస్టర్స్)

పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీలో కూడా... (పోస్టర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైరదాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనక అసలు కారణం అదనట. ఏప్రిల్ 8వ తేదీన తెలుగు, హిందీలో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న విషయాన్ని ఖరారు చేస్తూ ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు. బాలీవుడ్లో దాదాపు ఎనిమిది వందల పైచిలుకు థియేటర్లలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యారు. సర్దార్ సినిమా ద్వారా తన సినిమా పరిధిని విస్తరించాలని నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోంది.

Pawan Kalyan To Treat His Fans Pan India, Sardaar Is So Much More Special Now

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలో బుల్లితెరపై అనువాదమై ఎప్పటి నుండో ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు బాలీవుడ్లో మంచి స్పందన వస్తుందని, మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.

బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షించేందుకు డిఫరెంటుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. మరి బాలీవుడ్ చిత్ర సీమలో పవన్ జోరు ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి కేవలం హీరో మాత్రమే కాదు...కధ, స్ర్కీన్ ప్లే, నిర్మాణం ఇలా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశల్లో ఉన్న ఈ సినిమా ఆడియో మార్చి 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వేధిక ఖరారైన తర్వాత ఆడియోరిలీజ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
Sardaar Gabbar Singh
English summary
Sardaar Gabbar Singh now goes to Bollywood. Yes! Pawan Kalyan is all set to explore the Hindi market with his next release and the film will have a simultaneous release in Telugu and Hindi on 8 April.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu