»   » మా బంధువే, అన్నం పెట్టారు: దాసరి మరణంపై పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్

మా బంధువే, అన్నం పెట్టారు: దాసరి మరణంపై పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దాసరి మరణవార్త వినగానే షూటింగ్ కేన్సిల్ చేసుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. వీరితో పాటు నిర్మాత సుబ్బిరామిరెడ్డి కూడా వచ్చారు.

ఈ సందర్భంగా పవన్ క ళ్యాణ్ మాట్లాడుతూ... దాసరి వ్యక్తి గతంగా నాకు చిన్నప్పటి నుండి బాగా తెలుసు. మాకు బంధువులు కూడా. వ్యక్తి గతంగా కూడా దాసరిగారి మరణం నాకు తీరని లోటు. దాసరి గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ...

త్రివిక్రమ్ మాట్లాడుతూ...

త్రివిక్రమ్ మాట్లాడుతూ... నేను ఆయన దగ్గర పని చేయక పోయినా గురువుతో సమానం. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరు. ఆయనతో చాలా అనుబంధం ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దాసరి పద్మగారు నేను వాళ్ల సినిమాకు పని చేసేపుడు ఆవిడ నాకు భోజనం పెట్టారు. నేనెవరో తెలియక పోయినా సొంత మనిషిలాగా ఆదరించి ఇంట్లోకి పిలిచారు. ఈ ఇల్లుతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఆసుపత్రిలో చేరినపుడు కోలుకుని మళ్లీ సినిమాల్లో చురుకుగా పని చేస్తారనుకున్నాను... కానీ ఇలా జరుగడం బాధగా ఉందని తెలిపారు.

సుబ్బిరామిరెడ్డి

సుబ్బిరామిరెడ్డి

దాసరి నారాయణరావు మరణం బాధగా ఉంది. తెలుగు ప్రజల కీర్తిని యవత్ ప్రపంచం అంతా చాటి చెప్పిన మహా దర్శకుడు, నటుడు, నిర్మాత స్క్రిప్టు రైటర్, సినిమా రంగంపై బాగా పట్టున్న మనిషి. ఒక వ్యక్తిగా ఇటు రాజకీయంలో, అటు సినిమా రంగంలో కృషి చేసిన గొప్ప మనిషి. సినీ పరిశ్రమకు ఎంతో మంది దర్శకులను, టెక్నీషియన్స్ ను అందించారు. ఆయన లోటు సినీ పరిశ్రమకు తీరనిది అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ..

ఎన్టీఆర్ మాట్లాడుతూ..

దాసరి ఒక దర్శకుడే కాదు... తెలుగు సినిమా పరిశ్రమను పటిష్టం చేసిన వారిలో ఒకరు. తెలుగు కళామతల్లి కన్న ఒక దిగ్గజం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

ఆర్ నారాయణ మూర్తి

ఆర్ నారాయణ మూర్తి

ఆర్ నారాయణ మూర్తి స్పందిస్తూ... గురువుగారు ఇండస్ట్రీలో ఎవరెస్ట్ శిఖరం. ఆయన మరణం సినిమా రంగానికి తీరని లోటు. ఆయన ఎవరు వెళ్లినా కులం, మంతం, ప్రాంతం అనే తేడా లేకుండా ఆదరించేవారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన అంబేద్కర్ లాంటి వాడని కొనియాడారు.

English summary
Pawan Kalyan came to have last glimpse of Dasari Narayana Rao and paid his last respects. While talking to media he said he knows Dasari since his childhood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu