»   » పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి!

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తనకు అత్యంత సన్నిహితుడైన 'హారిక అండ్ హాసిని' క్రియేషన్స్ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ కోసం ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట.

పవన్ కళ్యాణ్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం చేయడానికి త్రివిక్రమ్ ఓ కథ తయారు చేసాడట. ఈ కథ పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చిందట. దాంతో పవన్, త్రివిక్రమ్ ప్లాన్ చేసిన 'కోబలి' చిత్రాన్ని పక్కన పెట్టి ఈ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాచేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan and Trivikram

ఇక త్రివిక్రమ్ నితిన్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. 'హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ ' బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారు అయ్యింది. "అ...ఆ" ...ట్యాగ్ లైన్ గా .. "అనసూయ రామలింగం వెర్శస్ ఆనంద్ విహారి " అని ఫిక్స్ చేసినట్లు నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలియచేసారు.

ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సమంత, మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (ప్రేమమ్ ఫేమ్ మళయాళి భామ) చేస్తోంది. . ఈ నిర్మాతతో త్రివిక్రమ్ కు ఇది మూడో సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఈ నిర్మాత చేస్తున్న చిత్రం ఇదే. సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. సంక్రాంతికి కు విడుదల చేస్తారు.

ఈ చిత్రం కు సౌండ్ డిజైనర్ గా విష్ణు గోవింద్, శ్రీ శంకర్ పనిచేయనున్నారు. సంగీతం అనిరుధ్, సినిమాటోగ్రఫి నటరాజ్ సుబ్రమణ్యన్, ఆర్ట్ రాజీవన్, ఎడిటింగ్ ...కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Film Nagar source said tha, Pawan Kalyan and Trivikram combination repeat again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu