»   » పవన్ కల్యాణ్ యూరప్‌కు షిఫ్ట్.. ఇక ధూమ్ ధామ్ అక్కడేనంట..

పవన్ కల్యాణ్ యూరప్‌కు షిఫ్ట్.. ఇక ధూమ్ ధామ్ అక్కడేనంట..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. హైదరాబాద్ పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం విదేశాలకు ప్రయాణమవుతున్నది ఈ చిత్ర యూనిట్. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల కంటే భారీ విజయాన్ని చేజిక్కించుకొనేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తున్నది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను యూరప్ నిర్వహించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ జూలై 19వ తేదీన యూరప్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొనేందుకు బయలుదేరనున్నది.

  త్రివిక్రమ్ తనదైన శైలిలో

  త్రివిక్రమ్ తనదైన శైలిలో

  యూరప్‌లో జరిగి తదుపరి షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని యాక్షన్ సీన్లను, కొన్ని పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. దాదాపు ఈ చిత్ర షూటింగ్ సగం పూర్తయినా గానీ కథేంటో బయటకు తెలియలేదు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ అని, త్రివిక్రమ్ తమదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది.

  అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం

  అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం

  ఇంకా పేరుపెట్టని ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పక్కన కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ జోడిగా నటిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తొలి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. .

  కొత్త గెటప్‌లో పవన్ కల్యాణ్

  కొత్త గెటప్‌లో పవన్ కల్యాణ్

  పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రంలో పంచెకట్టు, లాల్చీ, కోరమీసాలతో కనిపించిన పవర్ స్టార్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన గెటప్‌లో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం పవన్ చాలా బరువు తగ్గి కుర్రాడిలా తయారయ్యాడు. పవన్ తాజా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పవన్ గెటప్ చూసి అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

  దీపావళీకి విడుదల

  దీపావళీకి విడుదల

  ఇదిలా ఉంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలన్నే దిశగా చర్యలు తీసుకొంటున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, గోపాలకృష్ణుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి కానీ వాటిపై ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

  English summary
  Having known for delivering blockbusters such as Jalsa and Attarintiki Daaredhi, filmmaker Trivikram and actor Pawan Kalyan are eyeing for a hat-trick with their upcoming yet-untitled project. The film features Pawan in the role of software professional and the shoot is currently underway in Hyderabad where the makers have erected a set worth Rs 5 crore. The team, on July 19, will head to Europe for a 20-day schedule and plan to shoot a crucial action episode with chase and couple of songs.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more