»   » పవన్ కళ్యాణ్ 7 కోట్లు ఫైనాన్స్ చేసారా?

పవన్ కళ్యాణ్ 7 కోట్లు ఫైనాన్స్ చేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటుడిగానే కాదు...దర్శకుడిగా, ఫైట్ మాస్టర్‌గా, సింగర్‌గా ఇలా రకరకాలుగా తన టాలెంటు ఏమిటో చూపించారు. త్వరలో సొంత ప్రొడక్షన్ సంస్థ స్థాపించి నిర్మాతగా కూడా మారబోతున్నాడు. తాజాగా అందుతున్న ఆసక్తికర సమాచారం ఏమిటంటే.....ఆయన సినిమా ఫైనాన్షియర్‌గా మారారనే వార్తలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.

సినిమా ఫైనాన్షియలర్ అంటే.....సినిమాలు నిర్మించే నిర్మాతలకు అప్పు ఇవ్వడం అన్నమాట. పవన్ కళ్యాణ్ మేనలుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'రేయ్'. 2010లో మొదలైన ఈచిత్రం అనేక కారణాల వల్ల ఇప్ప లేటయింది. అందులో ముఖ్యమైన కారణం వైవిఎస్ చౌదరి ఆర్థిక ఇబ్బందులే.

ఈ నేపథ్యంలో 'రేయ్' సినిమాను త్వరగా పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ రూ. 7 కోట్లు ఈ సినిమా కోసం ఫైనాన్స్ చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సినిమాకు ఫైనాన్స్ చేయడం వల్లనే ఎట్టకేలకు సినిమా పూర్తయింది. 2014లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. త్వరలోనే ఈచిత్రం ఆడియో విడుదల కానుంది. ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు. 2010 అక్టోబర్ దసరాకి ప్రారంభమైన ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యమైంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సినిమాని పూర్తి చేసాం. నమ్మిన సిద్ధాంతం మంచిదైతే ఏ పని మధ్యలో ఆపకూడదు అనే ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, నేను జయాపజయాలను పట్టించుకోను అనే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సినిమా పూర్తి చేసాను అంటున్నారు వైవిఎస్ చౌదరి.

English summary
It is known that YVS Chowdary is introducing Pawan Kalyan’s nephew Sai Dharam Tej as hero with Rey. The film was on sets for a long period and YVS couldn’t finish the film as he got stuck in financial issues. Our most generous Pawan Kalyan came forward and helped YVS with 7 crore rupees to complete Rey.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu