అన్నయ్యను, వదినమ్మను, చెర్రీని విష్ చేస్తూ... పవన్ ట్వీట్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ పంక్షన్ శనివారం సాయంత్రం హాయ్ లాండ్ లో గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ పంక్షన్ శనివారం సాయంత్రం హాయ్ లాండ్ లో గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడా? లేదా? అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ 'ఖైదీ నెం 150' చిత్రం విషయంలో ఓ ట్వీట్ చేసారు. చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావడం చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నెం 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మన: పూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు.
pawan kalyan chiranjeevi ram charan khaidi no 150 tollywood పవన్ కళ్యాణ్ చిరంజీవి రామ్ చరణ్ ఖైదీ నెం 150 టాలీవుడ్


Click it and Unblock the Notifications