»   »  పవన్ పోస్ట్ చేసిన కవిత ఇదే., నిన్న అరెస్టయిన వారికోసం అంటూ...

పవన్ పోస్ట్ చేసిన కవిత ఇదే., నిన్న అరెస్టయిన వారికోసం అంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనవరి 26 దేశం మొత్తమే కాదు ప్రపంచం నలుమూలలా భరతీయులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగి తేలుతుంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్ర అట్టుడికిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని సాధించుకునేనుదుకు ఆంధ్రప్రదేశ్ యువకులే కాదు టాలీవుడ్ నుంచీ కూడా మద్దతు లభించింది. రాజకీయాలతో సంబందం ఉన్నా లేకున్నా చాలామంది హీరోలు తాము విశాఖ బీచ్ లో జరిగే దీక్షకు మద్దతు ఇస్తున్నాం అంటూ సంఘీభావం తెలిపారు.

అసలు ఈ ఉధయామనికి స్పూర్తినిచ్చిన ప్రధాన కారణాణాల్లో ఒకటి "పవన్ కళ్యాణ్". వేలమంది యువత ఆర్కే బీచ్ వద్దకు చేరీ చేరకముందే అరెస్టులూ, నిర్బందాలూ మొదలైపోయాయి... విశాఖ పట్టణం మొత్తం దద్దరిల్లింది. తెలంగాణా ప్రాంతం నుంచి వజాగ్ చేరిన ఒకే ఒక హీరో సంపూర్ణేష్ బాబు కూడా అరెస్టయ్యారు... నిన్న అరెస్టయిన వారందరినీ ఇవాళ వదిలేయనున్నారు. అలా ఒక లక్ష్యం కోసం వచ్చి నిర్బందం లోకి వెళ్ళిన వారి కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విటర్ ద్వారా అభినందించాడు.

 Pawan kalyan tweets Poem On Silent Protest Arrests

పవర్ స్టార్ తాజాగా చేసిన ట్వీట్‌లో "ఈరోజు అరెస్టు కాబ‌డి విడుద‌లైన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లకు, ప్ర‌జ‌లు, విద్యార్థుల‌కు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌ల‌ను. మీరు క్షేమంగా ఇంటికి చేరాల‌ని కోరుకుంటున్నాను. శేషేంద్ర‌గారి ప‌ద్యం తొలి మ‌జిలిలో సేద తీరుస్తుంద‌ని న‌మ్ముతున్నాను" అంటూ. దివంగత గుంటూరు శేశేంద్ర శర్మ గారి కవితలో కొన్ని లైన్ లను పోస్ట్ చేసాడు...

 Pawan kalyan tweets Poem On Silent Protest Arrests

"రాహువు ప‌ట్టిన ప‌ట్టొక సెకండు అఖండ‌మైన లోక‌బాంధ‌వుడు అస‌లే లేకుండా పోతాడా? మూర్ఖుడు అస‌లే ముళ్లు క‌ద‌ల‌నీకుండా చేస్తే ధ‌ర‌గ‌మ‌న‌మంత‌టితో త‌ల‌కిందులైపోతుందా? పాల‌కుల కూట‌మికొక త్రుటికాలం జ‌య‌మొస్తే విశ్వ స్రుష్టి ప‌రిణామం విచ్చిన్నం అవుతుందా? ధ‌నుజ లోకమేకంగా దారిక‌డ్డంగా నిలుచుంటే..న‌ర‌జాతి ప్ర‌స్థానం ప‌రిసమాప్త‌వుతుందా?" అంటూ ఒక కవిత లోని కొన్ని పాదాలను తీసుకొని ట్వీట్ చేశాడు. అయితే పాపం ఆ ట్వీట్‌లో అరెస్టయిన వారంద‌రినీ ప్ర‌స్తావించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పేరును మాత్రం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం

English summary
Janasena Founder, Actor Power Star pawan kalyan Tweeted some Lines From great Poet Gunturu SeSendra Sarma's poetry book For who Arrested On 26th for Silent Protesters at Vizag RK Beach
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu