»   »  యువతను ఉద్దేశించి అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

యువతను ఉద్దేశించి అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మన జాతీయ పతాకం సమగ్రత, సమైక్యతలకి సూచికగా నిలుస్తుందని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. నాయకులు జాతీయ సమైక్యతను మరచిపోయినా... యువత , విద్యార్థులు ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకుంటుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద భారత జాతీయ పతాకాన్ని గురువారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.

  ఎన్టీఆర్ స్టేడియంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ ఈ భారీ జెండాను రూపొందించింది. ఈ పతాకం 122 అడుగుల పొడవు, 183 అడుగుల వెడల్పుతో ( 22,326 చదరపు అడుగుల విస్తీర్ణం) ఉంది. తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, అశోక చక్రం.. ఇవన్నీ మన జాతి సమగ్రతకి, జాతీయ సమైక్యతకు నిదర్శనమన్నారు.

  Pawan Kalyan unfurls worlds largest Indian flag

  సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పినట్లు మన జాతీయ జెండా ఏ కులానిదీ, పార్టీది, మతానిది కాదు. ప్రతి ఒక్కరిదీ. కాషాయం అంటే హిందూ మతానికి సూచిక కాదు. ఆ రంగు మన రాజకీయ వ్యవస్థ, నాయకులు ఎలా ఉండాలో చెబుతుంది. కాషాయం కట్టినవాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా, స్వలాభం లేకుండా ఉంటారు. నాయకులూ అలాగే ఉండాలి. మన జెండా దేశం కోసం త్యాగాలు చేసినవారిని, స్వలాభం లేకుండా పని చేస్తారో గుర్తు చేస్తుందన్నారు. యువత ముందుకు వచ్చి ఈ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉంది. మీ ఔన్నత్యాన్ని తెలియచేస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

  ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన వారితో జాతీయ సమైక్యత ప్రమాణం చేయించారు. 'భారతీయుడినైన నేను.. భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ.. ప్రకృతికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుతూ.. అనునిత్యం దేశ ప్రజలకై పరితపిస్తూ.. మన అక్కచెల్లెళ్ళనీ, ఆడపడుచుల పట్ల పేగు బంధంతో కాపాడుతామని.. చట్టాలను గౌరవిస్తూ.. కుల,మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తానని మన జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ ఈ ప్రమాణం సాగింది. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలామ్ పాల్గొన్నారు.

  English summary
  Actor and Jana Sena Party founder Pawan Kalyan today unfurled the national flag at NTR stadium, Hyderabad. Speaking on the occasion, Pawan Kalyan quoted former President and educationist and philosopher Sarvepally Radhakrishnan as having said that the National Flag does not belong to any caste, religion or party and that it belongs to all.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more