»   » ఖుషి సినిమా నుంచి ఆ బ్యాగ్‌ని వదలిపెట్టని పవన్.. సెంటిమెంట్‌గా మారిపోయింది!

ఖుషి సినిమా నుంచి ఆ బ్యాగ్‌ని వదలిపెట్టని పవన్.. సెంటిమెంట్‌గా మారిపోయింది!

Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజా నాయకుడిగా మారిపోయారు. ప్రజల మధ్యలో ఉండడానికి నిర్ణయించుకున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రాకముందు నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. పవన్ కళ్యాణ్ ఇల్లు ఓ మినీ లైబ్రరీ అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ప్రజా పోరాట యాత్ర కోసం వైజాగ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ తన కు ఇష్టమైన వస్తువులు, పుస్తకాలు వెంటపెట్టుకుని వెళ్లారట. అందులో ఖుషి చిత్రం నుంచి వాడుతున్న బ్యాగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్యాగ్ సెంటిమెంట్

బ్యాగ్ సెంటిమెంట్

ఖుషి చిత్రం విడుదలై 17 ఏళ్ళు గడుస్తోంది. అప్పటి నుంచి ఒకే బ్యాగు ఉపయోగించడం అంటే మాటలు కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఓ బ్యాగుని అప్పటి నుంచి సెంటిమెంట్ గా ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పుస్తకాలతో పాటు బ్యాగ్ కూడా

పుస్తకాలతో పాటు బ్యాగ్ కూడా

పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లినా ఆ బ్యాగ్ ని వెంటపెట్టుకుని వెళతారట. ప్రజాయాత్రకు సిద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్ ఆ బ్యాగుని తన వెంట వైజాగ్ తీసుకుని వెళ్ళాడట. ఆదివారం నుంచి పవన్ కళ్యాణ్ ప్రజా యాత్ర ప్రారంభం అవుతుంది.

తెలుగు యువతని మార్చేసిన చిత్రం

తెలుగు యువతని మార్చేసిన చిత్రం

ఖుషి చిత్రం తరువాత తెలుగు యువత మొత్తం పవన్ కళ్యాణ్ ని అనుకరించడం ప్రారంభించారు. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధరించిన కాస్ట్యూమ్స్ ట్రెండ్ సెట్ చేశాయి.

అంబేత్కర్ భవనంలో సామాన్యుడిలా

అంబేత్కర్ భవనంలో సామాన్యుడిలా

ఆ బ్యాగులో తనకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ అంబేత్కర్ భవనంలో సామాన్య వ్యక్తిగా బసచేస్తున్నారు. స్టార్ హోటల్స్ లో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

English summary
Pawan Kalyan using a bag from Kushi time. That bag is sentiment for Pawan Kalyan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X