Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Pawan Kalyan వారాహికి లైన్ క్లియర్.. రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయిందంటే?
పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ జోరు చూపిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలపై కృషి చేస్తూ నాయకుడు అనిపించుకుంటున్నారు. ఇక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్లు చెప్పేలా ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వారాహి పేరుతో ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసిన పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా ఈ వాహనానికి తెలంగాణలో లైన్ క్లియర్ అయింది.

మిలటరీ ఆలీవ్ గ్రీన్ కలర్..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కోసం ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేయించిన విషయం తెలిసిందే. వారాహి పేరుతో రెడీ చేసిన ఈ వాహనం ట్రయల్ రన్ ను ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు. వాహనం పక్కనే భద్రతా సిబ్బంది అలా నడచివస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది చూసిన వైసీపీ నేతలు వాహనం కలర్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు కారణం వారాహి వాహనం మిలటరీ ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉండటమే. మిలటరీ ఆలీవ్ గ్రీన్ కలర్ ప్రైవేట్ వాహనాలకు ఉపయోగించేందుకు అనుమతి ఉండదని పలువురు పేర్కొన్నారు.

వారం క్రితమే రిజిస్ట్రేషన్..
అలాగే మిలటరీ ఆలీవ్ గ్రీన్ కలర్ ను ఇతర వాహనాలకు వేసుకోవడం మోటార్ వెహికిల్ యాక్ట్ కి విరుద్ధం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పనులు కూడా వాయిదా పడ్డాయని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఓ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి అధికారులు అన్ని అనుమతులు ఇచ్చారు. వాహనానికి రవాణా శాఖ అన్ని అనుమతులు ఉన్నాయని, వారం క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ అయిందని తెలుస్తోంది. వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికేట్ పరిశీలించామని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు.

వారాహి వాహనం కలర్ కోడ్..
పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి TS13EX 8384 అనే నంబర్ ను కేటాయించినట్లు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పేర్కొన్నారు. ఇక వచ్చే ఏపీ ఎన్నికల్లో జన సేనాని వారాహిపై రాష్ట్రమంతా పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే లారీ చాసిస్ ను బస్సుగా మార్చడం, ఉండాల్సిన ఎత్తుకంటే ఎక్కువ ఉండటం, మైన్స్ లో వాడాల్సిన వాహనాల టైర్లను రోడ్డుపై వెళ్లే వాహనానికి వాడారని, ఆర్మీకి సంబంధించిన కలర్ వాడారని విమర్శలు వచ్చాయి. అయితే కలర్స్ కు కోడ్స్ ఉంటాయి. భారత ఆర్మీ సంస్థ ఉపయోగించే కలర్ కోడ్.. అంటే ఆర్మీ కలర్ కోడ్ 7B8165 కాగా, ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ వారాహి వాహనం కలర్ కోడ్ 445c44 అని తెలుస్తోంది.