»   » పవన్ కళ్యాణ్-వెంకటేష్ మల్టీ స్టారర్ ఖరారు (ఫోటో ఫీచర్)

పవన్ కళ్యాణ్-వెంకటేష్ మల్టీ స్టారర్ ఖరారు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ రాబోతోంది. తాజాగా ఈ ప్రాజెక్టు వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. బాలీవుడ్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కబోతున్న ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

'ఓ మై గాడ్' చిత్రంలో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో నటించగా.....తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషించనున్నారు. హిందీలో పరేష్ రావల్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. బాలీవుడ్లో ఈచిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెలుగులోనూ ఈచిత్రం సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, వెంకటేష్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ ఎప్పటి నుండో కలిసి పని చేయాలనుకుంటున్నారు. అయితే ఇద్దరిక నచ్చే విధంగా కథలు దొకరక పోవడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ మూవీ ఖరారు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

డాలి దర్శకత్వంలో...?

డాలి దర్శకత్వంలో...?


తెలుగులో కొంచెం ఇష్టం కంచె కష్టం, తడాఖా చిత్రాలకు దర్శకత్వం వహించిన డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అయితే దర్శకుడిగా అతన్నే తీసుకోవాలా? వద్దా? అనే దానిపై క్లారిటీ రాలేదు.

‘ఓ మై గాడ్' కథ ఏమిటి?

‘ఓ మై గాడ్' కథ ఏమిటి?


'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

శ్రీకృష్ణుడి పాత్రలో...

శ్రీకృష్ణుడి పాత్రలో...


హిందీ వెర్షన్ ‘ఓ మై గాడ్' చిత్రంలో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడి పాత్రలో నటించాడు. తెలుగు వెర్షన్‌లో పవన్ కళ్యాణ్ కూడా శ్రీకృష్ణుడి గెటప్‌లో దర్శనమిస్తాడా? లేక మరేగెటప్‌లో అయినా దర్శనమిస్తాడా? అనేది త్వరలో తేలనుంది.

పవన్ ఫ్రెండ్ శరత్ మరార్

పవన్ ఫ్రెండ్ శరత్ మరార్


నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ అధినేత మరెవరో కాదు...పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్.

English summary
Pawan Kalyan and Venkatesh multi starrer movie announced. They will be working together for the official remake of Bollywood’s ‘Oh My God’. Suresh Productions and North Star Entertainments will jointly produce the movie. Pawan’s friend and aide Sharat Marar is the man behind North Star Entertainments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu