twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జనసేనాని మెడలో మరో పురస్కారం: ఐఈబీఎఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు పవన్ ఎంపిక

    జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ (ఐఈబీఎఫ్‌) ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు పవన్ ఎంపికయ్యాడు పవర్‌స్టార్.

    |

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ లండన్ పర్యటనకు వెళుతున్నాడు. ఈ నెల 15వ తేదీన ఆయన పర్యటన మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా లండన్ లో 'ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం' అందించనున్న ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించనున్నాడు. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపే వార్త ఇది. ఎందుకంటే..

     పవన్‌ కళ్యాణ్‌

    పవన్‌ కళ్యాణ్‌

    జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ (ఐఈబీఎఫ్‌) ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు పవన్ ఎంపికయ్యాడు పవర్‌స్టార్. ఈ నేపథ్యంలో, పవన్ రాక కోసం లండన్ లోని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

     పలు ప్రజాసమస్యలపై

    పలు ప్రజాసమస్యలపై

    భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఉద్ధానం బాధితుల సమస్యలతో పాటు, పలు ప్రజాసమస్యలపై పవన్ స్పందిస్తున్న తీరుకు ఈ అవార్డును ప్రకటించారు. 17వ తేదీన పవన్ ఈ అవార్డ్ తీసుకోనున్నాడు.

     ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం

    ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం

    ఈ మేరకు సోమవారం ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం ప్రతినిధులు ఇండియా అధిపతి సునీల్‌ కుమార్‌ గుప్తా, కో ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌లు పవన్‌ కళ్యాణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఐఇబిఎఫ్‌ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న పవన్‌కు ఈ ఏడాది ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

     కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో

    కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో

    ఈ సందర్భంగా వారు పవన్ చేసిన సేవలను గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్‌ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, కృషి ఎన్నో హృదయాలను కదిలించినట్లు వారు ప్రశంసించారు.

    English summary
    According to sources in the know, the Europe schedule will be wrapped up on November 15 and the lead star will be flying down to the UK where he will be honoured with the prestigious Indo-European Business Forum Award at the House of Lords for his contribution to arts, politics and social work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X