»   » ఎందుకెళ్లారు? పవన్ కళ్యాణ్ రాజాం...

ఎందుకెళ్లారు? పవన్ కళ్యాణ్ రాజాం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి సిక్కోలు(శ్రీకాకుళం) జిల్లాలో దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం జిల్లాలోని రాజాం చేరుకున్న ఆయన అక్కడి జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రి, నైరెడ్, జీఎంఆర్ ఐటీలను సందర్శించారు. కేర్ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం నైరెడ్ లో స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

వృత్తి పరంగా సినీ నటుడు అయిన పవన్ కళ్యాణ్‌కు.....సమాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మంచి పేరుంది. కేవలం సినిమాలు, డబ్బు సంపాదించడంపైనే కాకుండా తన సంపాదనలో కొంత మేర సమాజ సేవకు ఉపయోగించడం ఆయనకు అలవాటు. వివిధ ప్రాంతాల్లో పర్యటించడం, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయన సిక్కోలు పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pawan Kalyan visits Rajam

పవన్ కళ్యాణ్ సినిమాల వివరాల్లోకి వెళితే...
పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈచిత్రం ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. అనేకానేక కారణాలతో సినిమా ఇప్పటికీ పట్టాలెక్కలేదు. తాజా పరిస్థితి పరిశీలిస్తే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిచబోతున్నారు. ‘గోపాల గోపాల' విడుదల కావడంతో కాస్త ఫ్రీ అయిన పవన్ కళ్యాణ్....పర్సనల్‌గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు.

ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కు బ్యాక్ పోయిన్ ఉందని, శస్త్ర చికిత్స కోసం ఆస్ట్రేలియా వెలుతున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే రూమర్స్ విన్న పవన్ కళ్యాణ్ నవ్వారట. అలాంటిదేమీ లేదు...నేను షూటింగుకు రెడీగా ఉన్నానని దర్శక నిర్మాతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించనున్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. తొలి షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట.

అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

English summary
Tollywood power star and Janasena Party president Pawan Kalyan on Tuesday made a surprise visit to Rajam, Srikakulam district.
Please Wait while comments are loading...