For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘జులాయి’కి వాయిస్ ఓవర్ ఇచ్చిన మెగా హీరో

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'జులాయి' ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రంకు వాయిస్ ఓవర్ ని మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు,త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్ తో ఈ వాయిస్ ఓవర్ చెప్పించారని సమాచారం. గతంలో పవన్ జల్సా చిత్రానికి మహేష్ బాబు చేత వాయిస్ ఓవర్ చెప్పించి క్రేజ్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ ఈ సారి ఈ వాయిస్ ఓవర్ తో మెగా అభిమానుల్లో ఆనందం నింపబోతున్నారు.

  చిత్రం కథ విషయానికి వస్తే...అల్లు అర్జున్ రవి అనే పాత్రలోనూ,ఇలియానా మధు అనే పాత్రలో హైటెక్ ఇంజినీర్ గా కనిపించనుంది. రవి పక్కా జులాయి టైప్ క్యారెక్టర్. అతను..మధు తో పీకలోతు ప్రేమలో పడిపోయి,ప్రేమ గీతాలు పాడుతూంటాడు. మధు కూడా రవితో ఓ టైమ్ కి ప్రేమలో పడుతుంది. మరో ప్రక్క రవిని చంపటానికి ఓ గ్యాంగ్ వెతుకుతూ ఉంటుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఎవరా గ్యాంగ్..అసలు మధు ఎవరు...రవి జీవితంలోకి ఆమె రావటానికి కారణం ఏమిటి...ఇవన్నీ తెరపై చూడాల్సిందే.

  ఈ చిత్రంపై ప్రత్యేకమైన దృష్టిని పవన్ కళ్యాణ్ పెట్టినట్లు సమాచారం. ఆయనకి త్రివిక్రమ్ ప్రెండ్ కావటం,అల్లు అర్జున్ రిలేషన్ కావటంతో ఈ భాద్యత తీసుకున్నట్లు ెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రి రిలీజ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేటస్ ని ఎంక్వైరీ చేస్తూ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖలేజా తో ప్లాపు లో ఉన్న త్రివిక్రమ్,బద్రీనాధ్ తో ప్లాప్ లో ఉన్న అల్లు అర్జున్ కి ఇప్పుడు హిట్ కావాలి. ఇద్దరూ క్లోజ్ కావటంతో పవన్ ఈ చిత్రం రిలీజ్ ని స్మూత్ గా జరిగేటట్లు చూడటం,ట్రైలర్స్ కటింగ్ దగ్గర నుంచి తన సూచనలు ఇవ్వటం వంటివి చేసారని ఫిల్మ్ నగర్ టాక్. కెమెరామెమ్ గంగతో రాంబాబు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఈ చిత్రం పై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. దాంతో త్రివిక్రమ్,అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నట్లు,పవన్ కి ప్రత్యేక ధాంక్స్ చెప్తున్నట్లు తెలుస్తోంది.

  ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

  English summary
  Mahesh Babu gave his voice over for Pawan Kalyan’s Jalsa movie in the past. Taking this as inspiration, Ravi Teja gave voice over for Sunil’s Maryada Ramanna and Sunil gave voice over for small budget movie Nuvvilaa. Now, Pawan Kalyan was approached by director Trivikram to give voice over narration to Allu Arjun’s Julai movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X