విచిత్రం: పవన్ కల్యాణ్ కి అక్కడ ఓటు హక్కు

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కి ఎక్కడ ఓటు హక్కు ఉంది..ఉంటుంది అంటే కళ్లు మూసుకుని పవన్ నివాసముండే హైదరాబాద్ లో అని ఎవరైనా చెప్తారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓటర్ గా మరో చోట...నమోదయ్యింది. తాజాగా సినీనటుడు పవన్ కల్యాణ్ పేరుతో శ్రీరాంపూర్ మండలం నస్పూర్ పంచాయతీ ఓటరు జాబితాలో 'పవర్ స్టార్' ఫోటో ప్రచురితమైంది.

వివరాల్లోకి వెళితే... పంచాయతీ పరిధిలోని నస్పూర్ కాలనీలో దేవి లచ్చయ్య ఓటరుగా ఉన్నాడు. ఆ జాబితాలో ఆయన ఫోటో ఉండాల్సిన స్థానంలో పవన్ ఫోటో ఉంది. మిగతా వివరాలన్నీ లచ్చయ్యవే. నస్పూర్ కార్యాలయంలో సిబ్బంది జాబితా పరిశీలిస్తుండగా ఈ విచిత్రం వెలుగులోకి వచ్చింది.

Pawan Kalyan Voter ID issue

మరో చోట సైతం పవన్ కళ్యాణ్ తండ్రి చిరంజీవి అని...రంగారెడ్డి జిల్లా కుతుబుల్లాపూర్ లో ఓటర్ ఐడి ఇష్యూ అయ్యింది. ఆయన వయస్సు 27 అని, ఫిమేల్ అని..నమోదు అయ్యింది.ఆ ఐడి కార్డ్ నెంబర్ NVT2905752 అని ఉండటం విశేషం.

ఇటీవలే మరో మెగా హీరో రాంచరణ్ తేజను ధర్మవరం ఓటరుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో చేసిన దరఖాస్తులో పేరు చరణ్, ఇంటిపేరు బండి, వయసు 53 ఏళ్లు, పుట్టిన తేదీ 8-6-1960, తండ్రి పేరు చిరు అని, పట్టణంలోని రాంనగర్‌లోని డోర్‌నెంబర్ 8-168ఎ ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాంచరణ్ నటించిన మగధీర సినిమాలోని ఫొటోను జత చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకు వెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X