»   » తమిళ హీరో అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్

తమిళ హీరో అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ అజిత్ మీదే ఉంది. అతని తాజా చిత్రం మంగత్తా భాక్సాఫిస్ వద్ద సూపర్ హిట్ అవటంతో అలాంటి సబ్జెక్టే చేస్తున్న పవన్ దృష్టి మొత్తం అజిత్ మీదే పెట్టారు. ఆ సినిమా ఎలా ప్రమోట్ చేస్తున్నారు. అందులో ఏ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయాలను పవన్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక పవన్ చిత్రం డైరక్ట్ చేస్తున్న విష్ణు వర్ధన్ గతంలో అజిత్ తో భిళ్లా చిత్రం డైరక్ట్ చేయటం కూడా ఒక కారణం. ఆ భిళ్లానే తెలుగులో ప్రభాస్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో తీసారు.అయితే ఆ చిత్రం ఆడలేదు. ఇక పవన్ చేస్తున్న ఈ చిత్రానికి ది షాడో అనే టైటిల్ ని పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి నీలిమా తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలు. ఈ కాంబినేషన్ పై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అబ్బూరి రవి సంభాషణలన్నీ రాశాడు. యువన్ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం భిళ్ళాకి ప్రేక్వెల్ అంటే అసలు భిళ్ళా మాఫియాలోకి ఎలా ఎంటరయ్యాడు. నిల దొక్కుకునే సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..అన్న ఏంగిల్ లో కథను తయారు చేయాడని తెలుస్తోంది. అయితే భిళ్ళాకి భిళ్ళా2కి పోలిక కేవలం క్యారెక్టర్ కంటిన్యూషనే అని చెప్తున్నారు. ఇక స్టైలిష్ టేకింగ్ తీసే విష్ణు ఈ చిత్రం ఎక్కువ భాగం కలకత్తాలో తీసారు. ఈ చిత్రానికి ఫైట్స్: శ్యామ్ కౌశల్, రచన: రాహుల్ కోడా, కెమెరా: టి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీహరి ప్రసాద్, నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, యార్లగడ్డ శోభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.

English summary
After watching tamil hero Ajith act with grey hair in ‘Mankatha‘ movie and also his public appearances with same getup, Pawan too wanted to change his look on and off screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu