»   » అభిమన్యు సింగ్‌తో పోరాడనున్న పవర్ స్టార్

అభిమన్యు సింగ్‌తో పోరాడనున్న పవర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా 'గబ్బరసింగ్"(హిందీ దబాంగ్ రీమేక్) లో అభిమన్యు సింగ్ తో పోరాడనున్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్ విలన్ పాత్రలో నటించనున్నాడు. రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర"లో అభిమన్యు సింగ్ మంచి ఎక్స్ ప్రెషన్సతో సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అతన్ని ఈ సినిమాలో ఎంపిక చేశారు.

వాస్తవానికి తొలుత అభిమన్యు సింగ్ స్థానంలో హిందీ దబాంగ్ లో నటించిన సోనూ సూద్ ను తీసుకోవాలని చూశారు. అయితే ఇప్పటికే హిందీ దంబాగ్ తో పాటు, దబాంగ్ తమిళ రీమేక్ ఓస్తి సినిమాలో చేసిన సోనూ...ఇతర సినిమాలతో బిజీగా ఉండి మళ్లీ అదే పాత్రను చేయడానికి ఇష్ట పడక పోవడంతో అభిమాన్యు సింగ్ ను ఆ అవకాశం వరించింది.

పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా, పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై గణేష్ బాబు ఈ సినిమాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Power Star Pawan Kalyan will be seen fighting with Abhimanyu Singh in his next film Gabbar Singh. Abhimanyu Singh, who shot to fame with RGV’s Rakta Charitra is zeroed in for the negative lead role in this Bollywood remake of Dabangg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu