»   »  మాస్ అభిమానులకు పండగే.. పవన్ కళ్యాణ్, రవితేజ ఒకే వేదికపై.. అఫీషియల్!

మాస్ అభిమానులకు పండగే.. పవన్ కళ్యాణ్, రవితేజ ఒకే వేదికపై.. అఫీషియల్!

Subscribe to Filmibeat Telugu

మాస్ ఆడియన్స్ లో తన కంటూ పత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో రవితేజ. అందుకే మాస్ మహా రాజా రవితేజ అనే బిరుదు కూడా ఉంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలకు రవితేజ పెట్టింది పేరు. ఇటీవల రవితేజ చిత్రాలు నిరాశ పరుస్తున్నా రాజా ది గ్రేట్ చిత్రం అందరిని అలరించింది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలతో విజయం సాధించిన కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం రవితేజతో నేల టికెట్ చిత్రాన్ని త్తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ శైలిలో ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఆడియో వేడుక జరుపుకోబోతున్న ఈ చిత్రానికి సంబదించిన అదిరిపోయే న్యూస్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.

Ravi Teja Nela Ticket Has Got A rumour Regarding audio Launch

ఇప్పుడు అఫీషియల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేల టికెట్ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారనే వార్త గతంలోనే వచ్చింది. కానీ చిత్ర యూనిట్ స్పందించి అధికారికంగా ఖరారు కాలేదని క్లారిటీ ఇచ్చింది. తాజగా ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ట్విట్టర్ వేదికగా ఖరారు చేసారు. పవన్ కళ్యాణ్ నేల టికెట్ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు.

ఒకే వేదికపై వాళ్లిద్దరూ

ఒకే వేదికపై వాళ్లిద్దరూ

రవితేజ, పవన్ కళ్యాణ్ ఇద్దరికి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఆడియో వేడుక తేదీ ఖరారు

ఆడియో వేడుక తేదీ ఖరారు

నేల టికెట్ ఆడియో వేడుకని మే 10 న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చివరి దశలో ఉంది. ఆడియో వేదికని త్వరలోనే ప్రకటిస్తాం అని తెలిపారు.

మాళవిక శర్మ హీరోయిన్‌గా

మాళవిక శర్మ హీరోయిన్‌గా

ఈ చిత్రంలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. మే చివరి వారంలో చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.

English summary
Pawan Kalyan will grace Nela Ticket audio event as Chief guest. Director Kalyan Krishna confirm this news
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X