»   » చెడి పోతుందనే పవన్ కళ్యాణ్ అడ్డు పడ్డాడు

చెడి పోతుందనే పవన్ కళ్యాణ్ అడ్డు పడ్డాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న 'గోపాలా గోపాలా' షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. వెంకటేష్, ఇతర తారాగణంపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ అవుతారు.

వాస్తవానికి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించేది కేవలం 30 నిమిషాలు. అసలు ఒరిజినల్ వెర్షన్లో అక్షయ్ కుమార్ కనిపించేది కేవలం 20 నిమిషాలే. అయితే తెలుగు నేటివిటీకి తగిన విధంగా కథలో మార్పులు తేవడం, పవన్ స్టార్ అభిమానులను నిరాశ పరచవద్దనే ఏద్దేశ్యంతో ఒరిజినల్ వెర్షన్ 'ఓ మై గాడ్'లో అక్షయ్ కుమార్ పాత్రతో పోలిస్తే 'గోపాలా గోపాలా' చిత్రంలో పవన్ కళ్యాన్ పాత్ర ఓ పదినిమిషాలు ఎక్కువగానే పెంచేసారు.

Pawan Kalyan will soon join Gopala Gopala

తాజాగా అందిన సమాచారం ఏమిటంటే.....పవన్ కళ్యాణ్ పాత్ర 30 నిమిషాల కంటే ఇంకా ఎక్కువగానే పెంచుదామని దర్శకుడు, స్క్రిప్టు రైటర్స్ ట్రై చేసారట. ఇందుకోసం పవన్ కళ్యాణ్ నుండి మరిన్ని డేట్స్ తీసుకోవాలనే ప్లాన్ చేసారు. అయితే దీనికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు. ఇప్పటికే 10 నిమాషాల నిడివి ఎక్కువగానే ఉంది మరింత పెంచితే ఒరిజినల్ వెర్షన్‌ను చెడగొట్టినట్లు అవుతుందని నో చెప్పారట.

ఇతర వివరాల్లోకి వెళితే... సినిమాలో వెంకీ పాత్ర పేరు గోపాల్. పవన్ పోషించేది కూడా గోపాలుడి(కృష్ణుడి) పాత్రే కాబట్టి 'గోపాల గోపాల' టైటిల్ ఫైనల్ చేసారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.

English summary
Power Star Pawan Kalyan will soon join Gopala Gopala film unit in Hyderabad. Currently the unit is canning scenes involving Venkatesh and other artists. Pawan gave three weeks of call sheets and will take part in filming from 25th of this month. In original version Oh My God, hero Akshay Kumar's role exists for 20 minutes, where as in the remake version Pawan will be seen for at least 30 minutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X