»   » 'కాటమరాయుడు' సెట్లో .... కొత్త 2000 నోట్లతో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

'కాటమరాయుడు' సెట్లో .... కొత్త 2000 నోట్లతో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశంలో ఇపుడు ఎక్కడ చూసినా కొత్త నోట్లు, పాత నోట్ల హడావుడే. బిచ్చగాడి దగ్గర నుండి బిగ్ షాట్ల వరకు దేశంలోని ప్రతి పౌరుడిపై ఈ నోట్ల ఎఫెక్ట్ పడింది. కొత్త నోట్లు రావడం, పాతవి రద్దు కావడంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లవి.

మెడీ నిర్ణయాన్ని మొదట్లో దాదాపుగా అందరూ స్వాగతించినా.... తర్వాత మార్పడి విధానం, చిల్లర కొరతతో ఎదురవుతున్న చిల్లర ఇబ్బందులు, ఇతర సమస్యలతో కొందరు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టావర్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో స్పందించారు. "నోట్లు చెల్లవంటూ ప్రకటన చేసే ముందు తగిన కసరత్తు జరగలేదు. ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. పెద్దనోట్లు చెల్లవు అని చెప్పే ముందు తగిన స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది... కానీ అలా జరుగలేదు. కొత్త కరెన్సీ ఎంతమేర అందుబాటులో ఉందో ప్రభుత్వం బహిర్గతం చేయాలి అంటూ స్పందించారు.

కాటమరాయుడు సెట్లో...

కాటమరాయుడు సెట్లో...

కాటమరాయుడు సెట్లో షూటింగులో ఉన్న పవన్ కళ్యాణ్... కొత్త రూ. 2000 నోటు తన చేతికి రావడంతో పాత నోటును, కొత్త నోటును పరిశీలిస్తూ ఇలా....

ఏమేం మార్పులు చేసారు?

ఏమేం మార్పులు చేసారు?

కొత్త దాంట్లో, పాత దాంట్లో ఏమేం మార్పులు చేసారు, పాత నోటుకు, కొత్త నోటుకు తేడా ఏముంది అంటూ పరిశిలిస్తున్న పవన్ కళ్యాణ్.

అశాంతి

అశాంతి

నోట్ల విషయంలో ప్రజల్లో నెలకొన్న అశాంతిని పోగొట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.

వాస్తవాలను దాచలేదు

వాస్తవాలను దాచలేదు

గోప్యత ముసుగులో కేంద్రం వాస్తవాలను దాచలేదు. గ్రామీణ ఆర్థిక రంగం, పట్టణాల్లో అసంఘటిత మార్కెట్‌, వృద్ధుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ కోరారు.

సాయి మాదవ్ కవిత

సాయి మాదవ్ కవిత

నోట్ల రద్దుకు సంబంధించి సామాన్యుడి స్పందన' అంటూ తన మిత్రుడు, రచయిత సాయిమాధవ్‌ రాసిన కవితను పవన్‌ ట్వీట్‌ చేశారు. 'మెతుకు మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే, దొంగ కూడంటున్నారన్నా! నెనెట్టా బతికేది? కన్నీటి బొట్టు బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే.. నా ఏడుపు చెల్లదంటున్నారన్నా.. నేనెట్టా చచ్చేది?'' అంటూ రాసిన కవిత ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తోంది

English summary
Check out photos of Pawan Kalyan comparing and examining old 100 note with a new 2000 note.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu