»   » గెడ్డం లేదు: ‘సర్దార్’ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

గెడ్డం లేదు: ‘సర్దార్’ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా సినిమా ‘సర్దార్' సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. తాజాగా ఆయన సెట్స్ లో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. దర్శకుడు బాబీ తన ట్విట్టర్ ద్వారా ఈ ఫోటోలు విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా భారీ గెడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో కనిపించారు. దీన్ని బట్టి ఆయన ‘సర్దార్' సినిమాలో ఆయన గడ్డంతో కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.

Pawan Kalyan with Sardaar Director and Producer

మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం కావడం, పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ కావడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

Pawan Kalyan with Sardaar Director and Producer

ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఇక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలు. కొన్నీ సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Pawan Kalyan with Sardaar Director and Producer

ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనకు నచ్చిన విధంగా చేర్పులు, మార్పులు చేయించారు.

English summary
Pawan Kalyan with Sardaar Director & Producer Bobby & Sharrath Marar.
Please Wait while comments are loading...