»   » ఫాదర్స్ డే ఫోటో : ఇద్దరు పిల్లలతో పవన్

ఫాదర్స్ డే ఫోటో : ఇద్దరు పిల్లలతో పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. కొడుకు పేరు అకీరా నందన్, కూతరు పేరు ఆద్యా. పవన్ పలు సందర్భాల్లో కొడుకు అకీరాతో కనిపించారు కానీ, ఇద్దరు పిల్లతో మాత్రం ఇంత వరకు దర్శనం ఇవ్వలేదు. కనీసం అందుకు సంబంధించిన ఫోటో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు.

తాజాగా ఫాదర్స్ డేను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఓ ఫోటో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో అందుకు సంబందించిన దృశ్యాన్ని వీక్షించవచ్చు. పవన్ తన పిల్లల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో ఈ ఫోటో స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తాజా సినిమా 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) షూటింగులో భాగంగా యూరఫ్ లో పర్యటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడ పవన్ కల్యాణ్, హీరోయిన్స్ సమంత, ప్రణీతలపై రెండు పాటలను, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.

దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Here is the Exclusive Photo of Pawan Kalyan With His Son And Daughter Released on the occassion of Father day, is Son Name is Akira Nandan and his daughter name is Aadhya Konidala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu