»   » కాస్మోపాలిటన్ విజేత...పవన్ కళ్యాణ్

కాస్మోపాలిటన్ విజేత...పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ కాస్మోపాలిటన్ 2013 సంవత్సరానికి గాను ప్రకటించిన అవార్డుల లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు సినిమాల విభాగంలో బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. 'అత్తారింటికి దారేది' చిత్రానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

గత సంవత్సరం 'గబ్బర్ సింగ్' చిత్రంతో టాలీవుడ్ బాక్సాఫీసు దుమ్ము రేపిన పవన్ కళ్యాణ్....ఈ సంవత్సరం 'అత్తారింటికి దారేది' చిత్రంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు గాను ఆయనకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు దక్కుతుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

Pawan Kalyan

ఇతర అవార్డుల వివరాల్లోకి వెళితే...
ఇండియాలో మోస్ట్ పాపులర్ యాక్టర్ : సల్మాన్ ఖాన్
ఇండియాలో మెస్ట్ పాపులర్ హీరోన్ : కరీనా కపూర్
ఇంటర్నేషనల్ ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్: క్రిష్ 3
బెస్ట్ యాక్టర్ ఇన్ తమిళ్: విజయ్ (తలైవా)
బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్: షారుక్ ఖాన్ (చెన్నై ఎక్స్ ప్రెస్)
బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ : దీపిక పదుకొనె (రామ్ లీలా)
బెస్ట్ బాలీవుడ్ తెరంగ్రేట నటుడు : ధనుష్ (రంఝానా)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హిందీ : (యే జవాని హై దివానీ)
బెస్ట్ పాపులర్ సాంగ్: లుంగి డాన్స్ (చెన్నై ఎక్స్ ప్రెస్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) : ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్)
బెస్ట్ నటి (క్రిటిక్స్) : సోనమ్ కపూర్ (రంఝానా)
బెస్ట్ సహాయ నటి : దివ్యా దత్ (భాగ్ మిల్కా భాగ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : సోను సూద్ (ఆర్....రాజ్ కుమార్)
బెస్ట్ విలన్ : వివేక్ ఒబెరాయ్ (క్రిష్-3)
బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ : ధూమ్-3
బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ: ఆషికి-2
బెస్ట్ డైరెక్టర్ : రోహిత్ శెట్టి (చెన్నై ఎక్స్ ప్రెస్)
బెస్ట్ సర్ప్రైజ్ హిట్ : ఆర్..రాజ్ కుమార్
బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ధూమ్ 3

English summary

 Pawan Kalyan won 3rd Annual Cosmopolitan Magazine UK Awards. Pawan Kalyan won Best Actor Male for Attarintiki Daredi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu